English News Headline
CM Revanth Reddy Orders NIMS Treatment for Environmentalist Dushcharla Satyanarayana

పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వాకబు చేశారు. ఆయన ఆరోగ్యంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు దుశ్చర్ల సత్యనారాయణతో నేరుగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పూర్తి ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
దీంతో దుశ్చర్ల సత్యనారాయణకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయన పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సాధన కోసం దీర్ఘకాలంగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ చర్యను పలు వర్గాలు స్వాగతిస్తున్నాయి.
జలసాధన సమితి ద్వారా నీటి వనరుల పరిరక్షణ, ప్రజా సమస్యలపై దుశ్చర్ల సత్యనారాయణ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పర్యావరణ, నీటి హక్కుల అంశాలపై ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వం తక్షణ స్పందనతో వైద్య సహాయం అందించడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Full English News Article
Chief Minister A. Revanth Reddy personally enquired about the health condition of environmentalist and National President of Jalasadhana Samithi, Dushcharla Satyanarayana, and directed officials to ensure immediate medical support.
After receiving information about his health condition, the Chief Minister instructed authorities to take urgent steps. Following these directions, OSD Vemula Srinivasulu directly spoke with Dushcharla Satyanarayana to understand his medical condition.
The government then arranged treatment for him at Nizam’s Institute of Medical Sciences (NIMS) in Hyderabad with full expenses to be borne by the government.
This immediate response has been welcomed by many, especially those associated with environmental movements and water rights activism. Dushcharla Satyanarayana has been actively working for environmental protection and water resource conservation for several years.
Through Jalasadhana Samithi, he has led multiple public movements related to water resources and environmental awareness across Telangana. His work has made him a well-known voice in environmental advocacy.
Supporters and well-wishers expressed happiness over the government’s quick intervention and the assurance of proper medical treatment.