English News Headline
Hyderabad Boutique Fined Rs 1 Lakh for Faulty Blouse Stitching by Consumer Commission

Full Telugu News Article
హైదరాబాద్‌లో జాకెట్ సరిగా కుట్టకపోవడం ఓ బుటిక్కు భారీ నష్టాన్ని తెచ్చింది. వినియోగదారురాలికి సరైన సేవ అందించకపోవడంతో బంజారాహిల్స్‌లోని ఒక డిజైన్ స్టూడియోపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 రూ.1 లక్ష జరిమానా విధించింది. అదనంగా రూ.10 వేల కేసు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది.
ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన కె. అమృత వర్షిణి తన సోదరుడి పెళ్లిలో పెళ్లి ఆడపడుచుకు బహుమతిగా వచ్చిన కంచి పట్టుచీరకు సరిపోయేలా జాకెట్ కుట్టించేందుకు 2025 జనవరి 25న బంజారాహిల్స్‌లోని “బీ డిజైన్ ఫర్ యూ” అనే దుకాణాన్ని సంప్రదించారు. బ్లౌజ్ మెటీరియల్‌తో పాటు స్టిచింగ్ కోసం రూ.2,500 అడ్వాన్స్‌గా చెల్లించారు.
ఫిబ్రవరి 12 సాయంత్రంలోగా జాకెట్ అందించాలని ఆమె కోరారు. అయితే ఫిబ్రవరి 5న సంస్థ సిబ్బంది ఫోన్ చేసి బ్లౌజ్ మెటీరియల్‌ను తప్పుగా కట్ చేశామని అంగీకరించారు. దీనిపై అమృత వర్షిణి ఆందోళన వ్యక్తం చేయగా, మగ్గం వర్క్ చేసి లోపాన్ని కనిపించకుండా సరిచేస్తామని హామీ ఇచ్చారు.
కానీ చివరకు అందించిన జాకెట్ పెళ్లికి ధరించలేని స్థితిలో ఉండటంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్త చీర ఇవ్వాలని లేదా దాని ధర చెల్లించాలని సంస్థను కోరినా స్పందన రాలేదు. ఫోన్ కాల్స్‌కూ సమాధానం ఇవ్వలేదు.
దీంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాట్సాప్ చాట్స్, ఫోటోలు, చీర, రసీదులు ఆధారాలుగా సమర్పించారు. కేసును విచారించిన కమిషన్ సంస్థ సేవల్లో నిర్లక్ష్యం ఉందని నిర్ధారించి రూ.1 లక్ష పరిహారం, రూ.10 వేల లిటిగేషన్ ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఈ తీర్పు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలకమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో సేవ తీసుకున్నా నాణ్యతలో రాజీ పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
Full English News Article
A stitching mistake in Hyderabad has resulted in a major penalty for a boutique after the Hyderabad District Consumer Commission-I imposed a Rs 1 lakh compensation for faulty blouse stitching, along with Rs 10,000 towards litigation costs.
The complainant, K. Amrutha Varshini from Gandhinagar, Musheerabad, had approached a Banjara Hills boutique named “B Design For You” on January 25, 2025, to get a blouse stitched to match a Kanchi silk saree gifted for her brother’s wedding.
She submitted the blouse material and paid Rs 2,500 as advance stitching charges. She specifically requested the blouse to be delivered by the evening of February 12 for the wedding function.
However, on February 5, the boutique staff called her and admitted that the blouse material had been wrongly cut. When she asked for a solution, the staff assured her that they would fix the issue using maggam work and rejoining techniques so that the defect would not be visible.
But the final stitched blouse was in such poor condition that it could not be worn for the wedding. Amrutha Varshini demanded either a replacement saree or compensation for the damage. Though the boutique initially agreed, it later stopped responding and did not return the money.
She then approached the Consumer Commission and submitted WhatsApp chats, photos, the damaged saree, and payment receipts as evidence. After reviewing the case, the Commission ruled that the boutique had shown clear deficiency in service and ordered it to pay Rs 1 lakh compensation and Rs 10,000 as litigation expenses.
Legal experts say the judgment is significant because it reinforces consumer rights and sends a strong message that even small-value service failures can lead to serious legal consequences.