English: Sarees Distributed to SHG Group RP Women in Medchal

అలియాబాద్‌లో బతుకమ్మ ఘాట్‌కు భూమి పూజ
Full Telugu News Article
శామీర్‌పేట: శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌లో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలియాబాద్‌లో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు వైస్ చైర్‌పర్సన్ ఖాన్‌రెడ్డి మాలతి మాధవరెడ్డితో కలిసి చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు గాదె వెంకటేష్, గూదే వెంకటేష్, వాడగం శ్యామ్, వంగరి దినేష్, మున్సిపల్ ఏఈఈ సనా షహీన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.