శామీర్‌పేటలో రోడ్డు మరమ్మత్తులు పూర్తి

English News Headline

Shamirpet MLA Mallareddy Orders Immediate Road Repairs After Public Complaint


పూర్తి తెలుగు వార్త వ్యాసం

మెద్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ప్రాంతంలో రోడ్డు సమస్యపై స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన ఆయన రోడ్డు మరమ్మత్తుల పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 డివిజన్ శామీర్‌పేటలో గతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రోడ్డు మధ్య భాగాన్ని తవ్వారు. అనంతరం శామీర్‌పేట మున్సిపల్ GHMCలో విలీనం అయినప్పటికీ ఆ పనులు పూర్తి చేయకుండా అలాగే వదిలిపెట్టడంతో ప్రజలు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సమస్యపై గ్రామస్తులు ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలసి పరిస్థితిని వివరించగా, వెంటనే స్పందించిన ఆయన తన స్వంత నిధులతో సీసీ రోడ్ ప్యాచ్‌వర్క్ పనులను చేపట్టించారు. పనులు పూర్తవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఎల్లుబాయి, నాయకులు భూమి రెడ్డి, వెంకట్ రెడ్డి, ఐలయ్య యాదవ్, బాబు, సంజీవరెడ్డి, పవన్ ముదిరాజ్, శేఖర్, వెంకటేష్, నవీన్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, జగదీశ్వర్, పండరినాథ్ గౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Full English News Article

In Medchal–Malkajgiri district, Shamirpet MLA Mallareddy took swift action to address a long-pending road issue following complaints from local residents.

The problem arose after a road in Shamirpet (Division 300 under GHMC limits) was dug up for underground drainage works. However, the work was left incomplete even after the area was merged into GHMC, causing inconvenience to residents for several months.

Villagers approached MLA Mallareddy and explained the difficulties faced due to the damaged road. Responding immediately, the MLA arranged for CC road patchwork using his own funds. The repair work has now been completed, bringing relief to commuters and residents.

Locals expressed gratitude to the MLA for his quick response and resolution of the issue. Several local leaders and community members were present during the works.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *