గ్రైండర్ యాప్‌తో వల.. 14 చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్

English News Headline

Grindr Dating App Theft Racket Busted: Five Arrested in 14 Cases, Says Malkajgiri CP B. Sumathi

పూర్తి తెలుగు వార్తా కథనం

హైదరాబాద్: డేటింగ్ యాప్ గ్రైండర్ ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితులకు మత్తు కలిపిన బీర్ ఇచ్చి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ వెల్లడించారు.

నిందితులు మొదట గ్రైండర్ యాప్‌లో బాధితులతో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకునేవారు. వారి నమ్మకాన్ని సంపాదించిన తర్వాత విలువైన వస్తువులు, నివాస వివరాలు, వ్యక్తిగత అలవాట్ల గురించి తెలుసుకునేవారు.

అనంతరం వ్యక్తిగతంగా కలిసే నెపంతో బాధితుల ఇళ్లకు వెళ్లి, బీర్‌లో మత్తు కలిగించే పదార్థాలు కలిపి తాగించేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ముఠాకు సంబంధించి మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు విశాఖపట్నంలో మొత్తం 14 కేసులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో మూడు కేసులు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నమోదైనట్లు వెల్లడించారు.

English News Article

Hyderabad: Malkajgiri Police have busted an alleged theft racket in which the accused used the Grindr dating application to lure victims, drug them with spiked beer and steal gold ornaments and other valuables. Five accused have been arrested, Malkajgiri Commissioner of Police B. Sumathi, IPS, said.

According to the police, the accused initially developed relationships with victims through online chats and video calls. They allegedly gained their confidence and collected information about their valuables, residential addresses and personal circumstances.

The accused subsequently visited the victims’ residences on the pretext of personal meetings. They allegedly mixed intoxicating substances in beer and offered it to the victims. After the victims lost consciousness, the accused fled with gold ornaments and other valuables.

Police investigations identified links to 14 theft cases across Malkajgiri, Cyberabad, Hyderabad and Visakhapatnam. Three of these cases were registered within the Malkajgiri Commissionerate, police said.

Public Advisory

పరిచయం లేని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, నివాస చిరునామాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను మొదటిసారి కలిసేటప్పుడు బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *