English News Headline
Ebola Risk Alert: Africa CDC Warns 10 African Nations Over Possible Ebola Spread
Full Telugu News Article

ఎబోలా వైరస్ ముప్పుపై ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరో 10 ఆఫ్రికా దేశాలకు కూడా ఎబోలా వ్యాప్తి ప్రమాదం ఉందని ఆఫ్రికా వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు (ఆఫ్రికా CDC) హెచ్చరించాయి.
ఆఫ్రికా CDC డైరెక్టర్ జనరల్ జీన్ కసేయా వెల్లడించిన వివరాల ప్రకారం అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, కెన్యా, రువాండా, దక్షిణ సూడాన్, టాంజానియా, జాంబియా దేశాలు ఎబోలా ముప్పు జాబితాలో ఉన్నాయి. పొరుగు దేశాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నందున ఆయా దేశాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.
ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బుండిబుగియో స్ట్రెయిన్‌కు చెందినదిగా ఆరోగ్య అధికారులు గుర్తించారు. ఈ రకం వైరస్ కేసులు ముఖ్యంగా కాంగో ప్రాంతంలో ఎక్కువగా నమోదవుతున్నాయని సమాచారం. ఉగాండాలో 2007లో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు.
ఎబోలా వైరస్ సోకిన వారికి మొదట జ్వరం, దగ్గు, జలుబు, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం వాంతులు, విరేచనాలు రావడం ద్వారా శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్యులు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా పేర్కొంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఎబోలా లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. దీంతో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Full English News Article
Concerns over the spread of the Ebola virus are rising across several African nations after the Africa Centres for Disease Control and Prevention (Africa CDC) warned that 10 additional countries are at risk of a possible outbreak.
The warning comes amid ongoing Ebola concerns in the Democratic Republic of Congo and Uganda, where cases linked to the virus have already been reported. Africa CDC Director-General Jean Kaseya stated that Angola, Burundi, Central African Republic, Republic of Congo, Ethiopia, Kenya, Rwanda, South Sudan, Tanzania, and Zambia are among the countries facing potential Ebola risk.
Health authorities in neighboring countries have reportedly intensified surveillance and preparedness measures to prevent cross-border transmission. Officials fear the virus could spread further across the region if preventive actions are delayed.
According to health experts, the current rise in cases is linked to the rare Bundibugyo strain of the Ebola virus. This strain was first identified in Uganda in 2007 and is now reportedly contributing to increasing infections in parts of Congo.
Doctors say early Ebola symptoms include fever, cold, cough, muscle pain, weakness, and severe headache. In severe cases, patients may develop vomiting and diarrhea, which can lead to damage to vital organs and multi-organ failure.
The World Health Organization (WHO) has advised people showing Ebola symptoms to seek immediate medical attention. Health experts also warned that individuals with weak immunity are more vulnerable to infection and severe complications. Medical professionals are recommending immunity-boosting diets and early diagnosis to reduce health risks.