శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా అన్నదానం

English News Headline

Annadanam Organised at Sri Renuka Ellamma Temple in Shamirpet


Full Telugu News Article

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమానికి శామీర్‌పేటకు చెందిన వాసగౌని గణేష్ గౌడ్ కుటుంబ సభ్యులు, దేశం శ్రీనివాస్ గౌడ్ (పోలీస్) కుటుంబ సభ్యులు, యాస్కి పండరీనాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు సహకారం అందించారు. అలాగే రవి కుటుంబ సభ్యులు 25 కిలోల బియ్యాన్ని అందజేసి కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

ఎల్లమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరికీ సక్రమంగా ప్రసాదం పంపిణీ చేశారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల మధ్య ఐక్యత, సేవాభావం మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.


Full English News Article

A grand Annadanam (free meal distribution) programme was organised at the Sri Renuka Ellamma Temple in Shamirpet of Medchal-Malkajgiri district.

Special prayers were conducted for Goddess Ellamma on Tuesday, following which the meal distribution programme was arranged under the leadership of the Gouda Association. A large number of devotees visited the temple and participated in the religious activities.

The programme received support from the families of Vasagouni Ganesh Goud, Desam Srinivas Goud (Police), and Yaski Pandarinath Goud, all residents of Shamirpet. Ravi’s family also contributed 25 kilograms of rice for the Annadanam initiative.

Devotees visiting the temple, former public representatives, and pilgrims travelling along Rajiv Rahadari received the Annaprasadam. Organisers ensured smooth distribution of meals to all visitors.

Temple representatives stated that such religious and community service activities help strengthen social harmony and promote the spirit of service among devotees.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *