
Image: Screenshot from ‘ : https://x.com/TSwithKCR ” (used under fair use for reporting)
తెలంగాణలో వ్యర్థాలను విద్యుత్‌గా మలచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది.
The Telangana government is taking major steps to convert waste into energy through its flagship “Waste to Energy (WTE)” initiative launched under the BRS government’s sustainable and environmental mission.
ఈ క్రమంలో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో జవహర్‌నగర్‌లో రిఫ్యూజ్డ్ డిరైవ్డ్ ఫ్యూయల్ (RDF) ఆధారంగా 20 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
As part of the PPP (Public-Private Partnership) model, a 20 MW Waste to Energy plant based on Refused Derived Fuel (RDF) has been constructed at Jawaharnagar, and power generation has begun.
అదనంగా మరో నాలుగు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Officials stated that four more new Waste to Energy plants are currently under construction across Telangana.
జవహర్‌నగర్ ప్రాంతంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను విద్యుత్ తయారీకి వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు వ్యర్థాల నిర్వహణలో కొత్త దశకు నాంది పలికింది.
By utilizing the waste generated daily at Jawaharnagar for power production, environmental pollution is being reduced while ushering in a new era in waste management.
ఇదే ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.261 కోట్ల వ్యయంతో రెండు ఎంఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవి భూగర్భజలాలు కలుషితం కాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
As part of the same project, two leachate treatment plants with a capacity of 2 MLD each have been set up at a cost of ₹261 crore, playing a vital role in preventing groundwater contamination.
ఈ ప్రాజెక్ట్ ఫలితంగా జవహర్‌నగర్ ఒక మోడల్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్‌గా మారుతోంది.
As a result, Jawaharnagar is emerging as a model waste management center.
వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలతో ప్రతి సంవత్సరం రూ.200 కోట్ల విలువైన ఎరువులను తయారు చేస్తున్నారు. ఇది పర్యావరణ సంరక్షణతో పాటు రాష్ట్రానికి ఆర్థిక లాభాలను అందిస్తోంది.
From the waste materials processed here, fertilizers worth nearly ₹200 crore are produced annually — promoting both environmental protection and economic gains for the state.