జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ మరోసారి దీపక్‌రెడ్డిని రంగంలోకి దించింది. 2023 ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించిన ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చింది..BJP

Image: Screenshot from ‘ : https://www.google.com/  ” (used under fair use for reporting)

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ మరోసారి దీపక్‌రెడ్డిని రంగంలోకి దించింది. 2023 ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించిన ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చింది.
BJP has once again fielded Deepak Reddy in the crucial Jubilee Hills by-election, giving him another chance after securing 25,866 votes in the 2023 polls.

తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనేకమంది ఆశావహుల పేర్లు చర్చలోకి వచ్చినప్పటికీ, పార్టీ వ్యూహాత్మకంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్‌రెడ్డిని మళ్లీ బరిలోకి దించింది.
ఈ ఉపఎన్నికలో దీపక్‌రెడ్డి (బీజేపీ), నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి 25,866 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి పరిస్థితులు మారాయని, బీజేపీకి ఊపు ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

In the Jubilee Hills Assembly by-election, the suspense over BJP’s candidate has finally ended. Despite several aspirants vying for the ticket, the party has strategically re-nominated Deepak Reddy, who contested in the 2023 polls.
The main contest is set between Deepak Reddy (BJP), Naveen Yadav (Congress), and Maganti Sunitha (BRS). All three major parties are treating this by-election as a matter of prestige and have intensified their campaigns.
In the 2023 Assembly elections, Deepak Reddy secured 25,866 votes and stood third in Jubilee Hills. This time, party insiders believe the tide may favor the BJP, given the current political atmosphere.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *