
| Image: Screenshot from :’ https://www.google.com/” (used under fair use for reporting) |
కల్వకుంట్ల కవిత భారీ యాత్రకు Siddham.. కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి
Kalvakuntla Kavitha’s massive state tour ready — without KCR’s photo
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల చివరి వారంలో జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను రేపు విడుదల చేయనున్నారు. ఈసారి కవిత, మాజీ సీఎం కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలంటూ హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను కవిత ఇవాళ సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీ ఆవరణలో విద్యార్థులతో బైఠాయించి, వారి డిమాండ్లపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha’s massive tour across Telangana ready — without KCR’s photo
Kalvakuntla Kavitha, President of Telangana Jagruthi, is set to begin her district-wide tour in the last week of this month. The tour will continue across all districts until February next year. She is scheduled to release the wall poster of her tour tomorrow. Interestingly, Kavitha has decided to conduct this tour without featuring former Chief Minister K. Chandrashekar Rao’s photo, and instead, plans to use Professor Jayashankar’s photo as a symbolic representation of the Telangana movement. She has already been holding meetings with intellectuals and representatives from various sections of society to plan the tour strategy.
Meanwhile, Kavitha met the students protesting near the Chikkadpally Central Library in Hyderabad, demanding the reconduct of the Group-1 exam and the release of a job calendar. She interacted with the students, inquired about their problems, and held a discussion within the library premises. Kavitha demanded that the government take immediate steps to address the students’ issues.