
తిరుమల బ్రహ్మోత్సవాలు 2025 అంకురార్పణతో ప్రారంభం
Tirumala Brahmotsavam 2025 begins with Ankurarpanam rituals
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంకురార్పణ ఘట్టంతో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం మట్టికుండల్లో నవధాన్యాలు మొలకెత్తించి భూదేవిని ప్రసన్నం చేసుకోవడం ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశ్యం. సెప్టెంబర్ 23 మంగళవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ ఘట్టం జరుగగా, సెప్టెంబర్ 24 బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
The sacred Tirumala Venkateswara Swamy Salakatla Brahmotsavam 2025 will commence with the traditional Ankurarpanam ritual. As per Vaikhanasa Agama traditions, sprouting of nine grains (Navadhanyas) in clay pots symbolizes prosperity and divine blessings for the entire universe. The Ankurarpanam ceremony will be held on September 23 evening between 7:00–8:00 pm, followed by the nine-day grand festival from September 24 to October 2.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ నైరుతి దిశలో మేదిని పూజ నిర్వహించి పుట్టమన్నును సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. తరువాత యాగశాలలో అర్చకులు మట్టికుండల్లో పుట్టమన్ను నింపి, నవగ్రహాలకు ప్రతీకలుగా గోధుమలు, బియ్యం, కందులు, పెసలు, శనగలు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు ఇలా నవధాన్యాలను వేస్తారు.
During the ritual, soil collected after Medini Puja (worship of Earth goddess) will be brought in procession to the temple. Priests then sow the nine symbolic seeds in clay pots—wheat, rice, red gram, green gram, chickpeas, black-eyed beans, sesame, black gram, and horse gram—each representing the nine celestial bodies.
ఈ కార్యక్రమం ద్వారా భగవంతుడు భూమండలం సస్యశ్యామలంగా, సమస్త జీవజాతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు. అనంతరం ఆలయ సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల ఊరేగింపుతో ఉత్సవ ఏర్పాట్లు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.
The ritual seeks divine blessings for fertility, prosperity, and well-being of all living beings. The ceremonial procession of Vishvaksena, commander-in-chief of Lord Venkateswara’s army, marks the formal commencement of the Brahmotsavam arrangements.