ఆరోగ్యకర జీవన శైలిపై చంద్రబాబు సూచనలు – సిజేరియన్ శస్త్రచికిత్సలపై ఆందోళన..Chandrababu stresses

ఆరోగ్యకర జీవన శైలిపై చంద్రబాబు సూచనలు – సిజేరియన్ శస్త్రచికిత్సలపై ఆందోళన
Chandrababu stresses healthy lifestyle, raises concern on rising C-sections

మనిషి సగటు ఆయుష్షు 120 సంవత్సరాలు అని, కానీ అవసరమైన ఆహారాన్ని 40 ఏళ్లకే అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “ఆహారమే ఔషధం, వంటశాలే ఫార్మసీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ వంట నూనె, ఉప్పు, పంచదార వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రతిరోజూ కనీసం 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచించారు.

Chandrababu Naidu said that while the average human lifespan is 120 years, people consume food meant for 120 years within just 40 years, leading to health issues. He emphasized the need to follow the principle of “Food is medicine, kitchen is pharmacy.” He advised reducing the intake of oil, salt, and sugar, and ensuring at least eight hours of quality sleep every day.

ప్రతి ఒక్కరూ జీవనశైలిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలకు కూడా సలహాలు ఇస్తూ, ప్రతిరోజూ 45 నిమిషాలు యోగా లేదా వ్యాయామం చేయాలని, మితంగా పోషకాహారం తీసుకోవాలని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని సూచించారు.

He advised everyone to adopt a disciplined lifestyle. To MLAs, he suggested practicing yoga or exercise for at least 45 minutes a day, consuming nutritious food in moderation, and maintaining a positive outlook on life.

మరోవైపు, రాష్ట్రంలో 90 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని ఆమోదించలేమని, నియంత్రణకు చర్యలు అవసరమని చెప్పారు. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుందని, అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వలన దేశంలో జనాభా సమతుల్యత కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

On the other hand, Chandrababu expressed concern that nearly 90% of cesarean operations in Andhra Pradesh are being conducted in private hospitals. He said such practices cannot be accepted and called for measures to regulate them. He also projected that Andhra Pradesh’s population would reach 5.37 crore by 2026, noting that while South Indian states are witnessing a decline in population growth, states like Uttar Pradesh and Bihar are balancing India’s overall population.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *