
హోం మినిస్టర్ సోషల్ మీడియా లో వైసీపీ నేతల విష ప్రచారంపై ఘాటైన హెచ్చరిక చేశారు.
Home Minister issued a strong warning to YSRCP leaders over malicious social media propaganda.
అమరావతి/విజయవాడ: సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు. తప్పుడు ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
కల్పిత కథనాలు, అబద్ధాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. న్యాయపరమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని, కానీ అసత్య ప్రచారాన్ని వెంటనే ఆపాలని మంత్రి హితవు పలికారు.
Amaravati/Vijayawada: Home Minister Anitha lashed out at YSRCP leaders, accusing them of carrying out malicious campaigns on social media. She demanded evidence for their allegations, warning that otherwise they must be ready to face civil and criminal proceedings.
She clarified that fabricated stories and false propaganda cannot be considered as freedom of speech. While welcoming genuine political debate, she strongly cautioned that false campaigns must stop immediately.