సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని మాచవరం ఎంపీడీవో విష్ణు చిరంజీవి తెలిపారు…On Thursday,

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని మాచవరం ఎంపీడీవో విష్ణు చిరంజీవి తెలిపారు.

మాచవరం మండలం శ్రీ రుక్మిణి పురం గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఎంపీడీవో విష్ణు చిరంజీవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బంది ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల స్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన నాగేశ్వరరావు తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలపై అంగన్వాడీ కార్యకర్త నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్ పోతుకుంట లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

On Thursday, Machavaram MPDO Vishnu Chiranjeevi inspected the village secretariat at Sri Rukminipuram in Machavaram mandal of Gurazala constituency, Palnadu district. He reviewed records and assessed the quality of services being delivered to the public by the staff. Later, he visited the Anganwadi centre at Nageswararao Tanda and inquired with the Anganwadi worker about the nutritional food being provided to the children. Mandal Resource Person Potukunta Lakshmaiah and staff were present during this programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *