అమీర్ కరాటే అకాడమీ విద్యార్థులు మెరిసిన ప్రతిభ – సౌత్ ఇండియా ఛాంపియన్షిప్‌లో 8 పథకాలు..Ameer Karate

అమీర్ కరాటే అకాడమీ విద్యార్థులు మెరిసిన ప్రతిభ – సౌత్ ఇండియా ఛాంపియన్షిప్‌లో 8 పథకాలు
Ameer Karate Academy students shine with 8 medals at South India Championship

మహబూబాబాద్ / Mahbubabad
బెంగళూరులో ఆగస్ట్ 30, 31 తేదీల్లో జరిగిన సౌత్ ఇండియా జోనల్ కరాటే ఛాంపియన్షిప్‌లో మహబూబాబాద్‌కు చెందిన అమీర్ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 1 బంగారు, 2 వెండి, 5 కాంస్య పథకాలు సాధించారు.

At the South India Zonal Karate Championship held in Bengaluru on August 30–31, 2025, students of Ameer Karate Academy from Mahbubabad showcased their talent by bagging 1 gold, 2 silver, and 5 bronze medals.

8 ఏళ్ల మోహమ్మద్ సానియా (కూమిటే -25 కేజీలు) గోల్డ్ మెడల్ గెలిచింది. 12 ఏళ్ల మిడిడొడ్డి సంతోష్ కుమార్ (కూమిటే -40 కేజీలు), 11 ఏళ్ల కొనేటి థమన్ (కూమిటే -40 కేజీలు) వెండి పథకాలు అందుకున్నారు. 13 ఏళ్ల బండి హర్షిత్ రాజ్ (కటా), 8 ఏళ్ల బనోత్ వర్షిత్ (కటా), 6 ఏళ్ల అబ్బర బోయిన రోహిత్ (కటా), 10 ఏళ్ల గోలుసుల దేవ్వంశ్ సాయి (కూమిటే -25 కేజీలు), 8 ఏళ్ల సమ్మేట ఆరుష్ (కూమిటే +35 కేజీలు) కాంస్య పథకాలు సాధించారు.

Eight-year-old Mohammad Saniya won gold in Kumite -25 kg. Medidooddi Santosh Kumar (12, Kumite -40 kg) and Koneti Thaman (11, Kumite -40 kg) won silver medals. Bronze medals went to Bandi Harshit Raj (13, Kata), Banoth Varshit (8, Kata), Abbara Boyina Rohit (6, Kata), Golusula Devvamsh Sai (10, Kumite -25 kg), and Sammeta Aarush (8, Kumite +35 kg).

ఈ సందర్భంగా జిల్లా క్రీడా అధికారి ఓలేటి జ్యోతి విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శి అమీర్ పాషా మాట్లాడుతూ తన విద్యార్థుల కృషి ప్రశంసనీయం అని, భవిష్యత్తులో నేషనల్ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా కఠినమైన శిక్షణ అందిస్తానని చెప్పారు. విజేతల తల్లిదండ్రులు కూడా కోచ్ అందిస్తున్న శిక్షణపై సంతోషం వ్యక్తం చేశారు.

On this occasion, District Youth Sports Officer Oleti Jyothi congratulated the winners and wished them success at national and international levels. Karate India Organization District Secretary Ameer Pasha praised the efforts of his students and promised to provide intensive training to help them achieve more victories at the national level. Parents of the medal winners also expressed happiness over the special training provided by the coach.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *