ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారా? బుధవారం ప్రెస్‌మీట్‌లో కీలక ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి…ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారా? బుధవారం ప్రెస్‌మీట్‌లో కీలక ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Will K Kavitha resign as MLC? Speculation grows ahead of her Wednesday press meet.

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చుట్టూ ఉన్న నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు.

కవిత కొత్త పార్టీ స్థాపనపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని కొనసాగించాలా లేదా అన్న అంశంపై ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కవిత, రాజీనామా విషయంలో అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నారని సమాచారం. కవిత 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. 2020లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికై, 2026 వరకు పదవీ కాలం కొనసాగనుంది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, కవిత నిర్ణయం రాజకీయంగా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత పదవిలో కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా ఈ పరిణామాలను సమీక్షిస్తున్నారని సమాచారం. కవిత తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.
Will K Kavitha resign from her MLC post? Speculation is high that she might make a key announcement at her press meet on Wednesday.

There is buzz that Kavitha, who was suspended from BRS, is considering stepping down as MLC. Recently, she strongly criticised leaders close to BRS chief KCR, after which she faced suspension from the party. Now, she has scheduled a press meet on Wednesday afternoon to address the media.

Speculation is also rife that Kavitha may float a new political party. In this context, she is said to be weighing her options on whether to continue as MLC or resign.

Already facing legal hurdles in the Delhi liquor scam case, Kavitha is reportedly examining all angles before making a final call on her resignation. She earlier served as Nizamabad MP from 2014 to 2019. In 2020, she was elected as a nominated MLC, and her tenure is due to continue till 2026.

With BRS struggling after a series of defeats, Kavitha’s decision is seen as politically significant. Discussions are heating up in political circles on whether she will continue in office or quit. Sources indicate that even BRS chief KCR is closely reviewing these developments. Kavitha’s final decision is expected soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *