
సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా సినిమా మిరాయ్ నుంచి శ్రియ శరణ్ అంబిక పాత్రలో ప్రత్యేక పోస్టర్ విడుదలైంది.
Superhero Teja Sajja’s much-awaited pan-India film Mirai released a special poster introducing Shriya Saran as Ambika.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. తేజ సజ్జా సూపర్ యోధుడిగా కనిపించగా, శ్రియ శరణ్ పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా, మనోజ్ మంచు, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం, సినిమాటోగ్రఫీతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలు సమకూర్చగా, గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ సుజిత్ కుమార్ కొల్లి నిర్వహిస్తున్నారు.
₹12 సెప్టెంబర్‌న ‘మిరాయ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Superhero Teja Sajja’s pan-India movie Mirai has unveiled a special poster introducing Shriya Saran in the role of Ambika.
Produced by People Media Factory, this epic sci-fi action adventure is directed by Karthik Ghattamneni. While Teja Sajja appears as the super warrior, Shriya Saran plays a powerful mother character. The newly released poster reflects the emotional depth behind the superhero’s journey.
The film also stars Ritika Nayak as the female lead, with Manoj Manchu, Jayaram, and Jagapathi Babu in key roles. Karthik Ghattamneni has handled the direction, cinematography, and screenplay, while Manibabu Karanam provided the story and dialogues. The music is composed by Gowrahari, art direction by Nagendra Tangala, and executive production by Sujith Kumar Kolli.
Mirai is set for a grand worldwide release on September 12.