కవిత తీవ్ర ఆరోపణలు – హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌పై మరకలు పడుతున్నాయన్నారు…కవిత

కవిత తీవ్ర ఆరోపణలు – హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌పై మరకలు పడుతున్నాయన్నారు.
Kavitha makes sharp allegations, says Harish and Santosh responsible for blemishes on KCR.

హైదరాబాద్
బీఆర్ఎస్ నాయకురాలు కవిత మరోసారి పార్టీ లోపలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఆదేశాలు రావడం తనకు బాధ కలిగిస్తోందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితికి హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతే కారణమని నేరుగా ఆరోపించారు. కేసీఆర్‌కు డబ్బు మీద ఆసక్తి లేకపోయినా, వారిద్దరూ భారీ అవినీతిలో పాల్గొన్నారని అన్నారు. అందుకే గతంలో కేసీఆర్, హరీష్ రావును నీటి పారుదల శాఖ నుంచి తొలగించారని గుర్తు చేశారు.

తన తండ్రి పై సీబీఐ కేసులు రావడం వల్ల పరువు దెబ్బతింటే తనకూ బాధ తప్పదని కవిత కంటతడి పెట్టుకున్నారు. ఈ వ్యవహారం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఎవరి సహకారంతోనో ఇలా మాట్లాడుతున్నారని అనుకోవద్దని, నిజానికి హరీష్, సంతోష్ లే రేవంత్‌తో చేతులు కలిపారని అన్నారు.

అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశమైన కవిత, అవినీతి కేసుల్లో వందల కోట్లు బయటపడినప్పటికీ ఎవరు వెనుక ఉన్నారో బయట పెట్టాలన్నారు. అవినీతి వలయంలో కేసీఆర్ బలిపశువుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసుల్లో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కవిత ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉద్రిక్తతలకు దారితీయనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Kavitha’s Sharp Allegations – Says Harish and Santosh Responsible for Stains on KCR

Hyderabad
BRS leader Kavitha once again made sensational comments within the party. She said she was deeply pained by the CBI ordering an inquiry against KCR. Kavitha directly alleged that it was due to the corruption of Harish Rao and Santosh Rao that this situation had arisen. She stated that although KCR had no interest in money, both of them were involved in massive corruption. That was why, she recalled, KCR had removed Harish Rao from the Irrigation Ministry in the past.

Becoming emotional, Kavitha said it was unbearable for her to see her father’s reputation being tarnished by CBI cases. She alleged that Chief Minister Revanth Reddy was behind this episode. She rejected the notion that she was speaking under someone’s influence and instead claimed that Harish and Santosh had actually joined hands with Revanth.

After returning from the USA, Kavitha addressed members of Telangana Jagruthi and said that even though hundreds of crores had been unearthed in corruption cases, the real forces behind them must be revealed. She remarked that KCR was becoming a scapegoat in this web of corruption. However, she expressed confidence that KCR would come out spotless from these cases.

Observers believe Kavitha’s remarks are likely to spark fresh tensions within the BRS party.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *