
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
Four people died and five others were injured in a major road accident.
మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం విషాదానికి దారి తీసింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఉదయం 2 గంటల సమయంలో ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ హసన్ (35), అస్రాఫ్ ఉన్నిసా (70), ఎల్లమ్మ (40), మరో మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన ఐదుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు.
In a tragic accident at Addakula in Mahabubnagar district early Monday morning, a Hyderabad to Proddatur bound travels bus rammed into a lorry ahead around 2 AM. The mishap claimed the lives of bus cleaner Hasan (35), Ashraf Unnisa (70), Ellamma (40), and another woman on the spot. Five others were injured and shifted to a nearby hospital.