
| Image: Screenshot from ‘ “PHOTO PROMPT FROM HIS X ACCOUNTKTR News reposted (used under fair use for reporting) |
జూరాల, మంజీరా, సింగూరు ప్రాజెక్టులకు ప్రమాద హెచ్చరికలు వచ్చినా, మేడిగడ్డపై మాత్రమే కక్ష చూపడం వివాదాస్పదంగా మారింది.
Warnings for Jurala, Manjeera, and Singur projects raise concern, but selective targeting of Medigadda sparks controversy.
జూరాల ప్రాజెక్టులో 9వ గేట్ రోప్ తెగిపోవడం, ఇతర గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటం, మంజీరా బ్యారేజీ భద్రతపై నిపుణుల హెచ్చరికలు, సింగూరు డ్యామ్‌కు ప్రమాద సూచనలు వెలువడటం—ఇవన్నీ రాష్ట్ర జలవనరుల భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (NDSA) నివేదికల్లో స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, అన్ని ప్రాజెక్టులకు సమాన ప్రాధాన్యం ఇవ్వకుండా మేడిగడ్డ బ్యారేజీపై మాత్రమే విమర్శలు చేయడం పట్ల రాజకీయ వర్గాలు, ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రాజెక్టులు నిర్మాణం తర్వాత రిపేర్లు సాధారణమేనన్న సూత్రాన్ని పక్కన పెట్టి, మేడిగడ్డలోని రెండు పిల్లర్లను మాత్రమే కేంద్రీకరించి, కమిషన్ల పేరుతో ఆరోపణలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. జూరాల, మంజీరా, సింగూరు వంటి తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రానికి కీలకం కావడంతో, వాటి భద్రత కోసం యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల అవసరాలను తీర్చే ప్రతి ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Danger alerts for Jurala, Manjeera, and Singur projects are raising public concern, but the focus on criticising only Medigadda has triggered controversy.
The snapping of the rope on Gate No. 9 at the Jurala project, the weakened condition of other gate ropes, expert warnings on the safety of the Manjeera barrage, and danger signals for the Singur dam are all heightening fears over the safety of Telangana’s water resources. Even though the National Dam Safety Authority (NDSA) has issued clear warnings, political circles and the public are questioning why equal priority is not being given to all projects, while criticism is centred only on Medigadda barrage.
Ignoring the fact that repairs after construction are normal for any project, targeting just two pillars of Medigadda and linking it to allegations of commissions has drawn strong criticism. As Jurala, Manjeera, and Singur are crucial for drinking and irrigation needs in the state, experts stress the need for urgent repairs on a war footing. There is a growing consensus that every project serving public needs should be safeguarded as a top priority.