Recognising that the eradication of narcotics is both a personal responsibility and a social duty, an anti-drug pledge was organised at the Jagtial district police headquarters…మాదకద్రవ్యాల

మాదకద్రవ్యాల నిర్మూలన వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక కర్తవ్యమని గుర్తిస్తూ, జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నిర్వహించారు.
Recognising that the eradication of narcotics is both a personal responsibility and a social duty, an anti-drug pledge was organised at the Jagtial district police headquarters.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరించి, తమతో పాటు ఇతరులను కూడా మాదకద్రవ్యాల ప్రభావం నుండి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, డ్రగ్స్ విక్రయం, కొనుగోలు లేదా అక్రమ రవాణాలో పాల్గొనే వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు.
As per the directions of District SP Ashok Kumar, officers and staff taking part in Wednesday’s event pledged to adopt a drug-free lifestyle, protect others from falling prey to narcotics, and report any instances of drug sale, purchase, or illegal transport to the authorities.

అంతకుముందు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఇలాంటి కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏవో శశికళ, డీసీఆర్భీ, ఎస్భీ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీ ఖాన్, రఫిక్ ఖాన్, ఆర్ఐలు కిరణ్ కుమార్, సైదులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Earlier, SP Ashok Kumar also participated with Collector Satya Prasad in a similar programme held at the Collectorate. Officials including AVO Shashikala, DCRB, SB, IT Core Inspectors Srinivas, Arif Ali Khan, Rafique Khan, RIs Kiran Kumar, Saidulu, along with other police officers and staff, took part in the events.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *