తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించబడింది. Thousand-foot national flag rally by students marks patriotic fervour in Tirupati.
హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వీయూ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహతి ఆడిటోరియం నుండి ఎస్వీయూ స్టేడియం వరకు వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో విశాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక కమిషనర్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కేవలం జెండా ప్రదర్శనకే పరిమితం కాకుండా దేశభక్తి, నగర పరిశుభ్రత, యువత భాగస్వామ్యం వంటి అంశాల్లో స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. దేశం 2050 నాటికి ప్రథమ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే యువత కృషి చేయాలని సూచించారు.
కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో జెండా ఎగురవేయడానికి ప్రోత్సాహకర కార్యక్రమాలు చేపట్టామని, నగర పరిశుభ్రతలో ప్రతి పౌరుడూ బాధ్యత వహించాలని కోరారు.
వే ఫౌండేషన్ అందించిన వెయ్యి అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
As part of the Har Ghar Tiranga campaign, Tirupati Municipal Corporation, Tourism, and SV University jointly organised a massive rally on Tuesday, carrying a thousand-foot-long tricolour from Mahati Auditorium to SVU Stadium. The rally was flagged off by District Collector Venkateshwar and Municipal Commissioner Mourya.
The Collector urged that Independence Day celebrations should go beyond flag displays to inspire patriotism, city cleanliness, and youth participation in nation-building. He said India aims to become the world’s top economy by 2050, and youth have a major role to play.
Commissioner Mourya stated that initiatives are in place to encourage every household to hoist the flag and stressed the responsibility of all citizens in maintaining city cleanliness.
The rally, held with the support of Way Foundation, saw enthusiastic participation from students, public representatives, officials, and volunteers.