
సీఎం చంద్రబాబు మైదుకూరు అభివృద్ధి పనుల నిధులపై సుముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
CM Chandrababu has agreed to allocate funds for development works in Mydukur. He directed officials to act immediately on MLA Putta Sudhakar Yadav’s requests.
మైదుకూరు:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విజయవాడ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపుపై చర్చించారు. బ్రహ్మంగారిమఠంలోని ఈశ్వరి దేవి మఠం పునర్నిర్మాణానికి పిడిఎఫ్ కింద మంజూరైన 3 కోట్ల రూపాయల నిధుల విడుదలపై ముఖ్యమంత్రిని గుర్తు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మైదుకూరు పురపాలక పరిధిలో 120 కోట్లతో ప్రతిపాదించిన శాశ్వత తాగునీటి పథకం ఫైల్ క్లియరెన్స్ సహా అనేక అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ సూచనలు ఇచ్చారు. వీటిపై కూడా సీఎం తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వైయస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అభివృద్ధి కోసం కేంద్ర ప్రసాద్ పథకం కింద 45 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి నిధులు మంజూరయ్యేలా చూడాలని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం సుధాకర్ యాదవ్ చేస్తున్న కృషిని ప్రశంసించిన ముఖ్యమంత్రి, సంక్షేమం కోసం ఇదే కృషి కొనసాగించాలని సూచించారు.
CM Chandrababu has agreed to release funds for key development works in Mydukur, responding positively to MLA Putta Sudhakar Yadav’s requests.
సీఎం చంద్రబాబు మైదుకూరు అభివృద్ధి పనుల నిధులపై సుముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Mydukur:
MLA Putta Sudhakar Yadav met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at the Vijayawada Secretariat. During the meeting, Sudhakar Yadav requested funds for various development projects in the Mydukur constituency. He specifically reminded the CM about the release of ₹3 crore sanctioned under the PDF for the reconstruction of Eeshwari Devi Math in Brahmamgari Math. Responding promptly, the Chief Minister instructed the officials to release the funds without delay.
Sudhakar Yadav also raised the issue of file clearance for the permanent drinking water scheme, proposed at a cost of ₹120 crore in the Mydukur municipality, along with several other developmental works. The CM directed senior officials to expedite these projects and ensure immediate fund allocation.
Additionally, the MLA urged the CM to pursue the central government for ₹45 crore under the ‘Prasad’ scheme for the development of Jagadguru Sri Madvirat Pothuluri Veera Brahmendra Swamy Math in YSR Kadapa district. Chandrababu assured that necessary proposals would be forwarded to the Centre promptly to secure the funds.
The Chief Minister praised Sudhakar Yadav’s efforts for the development of the Mydukur constituency and encouraged him to continue his work with the same dedication for public welfare.