పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 21న శిల్పకళావేదికలో…Hari Hara VeeraMallu pre-release event to be held on July 21st

పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 21న శిల్పకళావేదికలో
Hari Hara VeeraMallu pre-release event to be held on July 21 at Shilpakala Vedika, Hyderabad

పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో జూలై 21న శిల్పకళావేదికలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Pawan Kalyan’s much-awaited film Hari Hara VeeraMallu is all set for a grand release on July 24. Ahead of the release, the makers have officially confirmed that the pre-release event will be held on July 21 at Shilpakala Vedika in Hyderabad.

ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ఈ వేడుకలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవరెవరు వస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

The event will begin at 6 PM, where Pawan Kalyan is expected to deliver a speech. Fans are eagerly waiting for his words more than anything else. Details about the chief guests are yet to be revealed.

అయితే తొలుత తిరుపతిలో ఈ వేడుకను నిర్వహించాలనుకున్నారు. అయితే అక్కడ భద్రతా కారణాల వల్ల లోకేషన్ మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈవెంట్‌ను ఇన్‌డోర్ వేదికలో, పరిమిత సంఖ్యలో అభిమానుల మధ్య జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Initially, the team planned to hold the event in Tirupati. However, due to crowd and security concerns, they shifted it to an indoor venue in Hyderabad with a limited audience and media presence.

ఇక నార్త్ ఇండియాలో మరో ప్రత్యేక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

There are also reports of a separate pre-release event planned in Kashi for North Indian audiences, but an official confirmation is awaited.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *