
విద్యార్థుల సమస్యలపై లోకేష్‌ను కలిసిన చంద్రశేఖర్
Principal Chandrasekhar Meets Minister Lokesh Over Student Welfare Issues
Telugu News | Full Report in Telugu
బ్రహ్మంగారిమఠం విద్యార్థుల విద్యావసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారిమఠం మండలంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి లేదని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను తొట్లపల్లెకు ఉన్నపళంగా తరలించడం విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు.
During a meeting held at Mangalagiri, Junior College Principal Chandrasekhar brought to the notice of Education Minister Nara Lokesh the lack of hostel facilities for students pursuing intermediate and degree education in Brahmangarimatham mandal. He also raised concerns over the abrupt relocation of Dr. B.R. Ambedkar Gurukula School from Brahmangarimatham to Thotlapalle, which he said would disrupt students’ learning and access.
విద్యార్థుల సమస్యలు విన్న మంత్రి లోకేష్ ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల న్యాయానికి ప్రభుత్వ మద్దతు అందిస్తామని ఆయన తెలియజేశారు.
The minister reportedly responded positively and assured that he would discuss the matter with relevant authorities and ensure justice for the students. This meeting is seen as a crucial step in bringing the voices of students from remote mandals into policy discussions.