విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

PM Modi, CM Chandrababu Grace International Yoga Day 2025 in Visakhapatnam; For Telugu News and English News kindly scroll down

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

🗞️ Full Report in Telugu:

విశాఖపట్నం:
విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ యోగా ఆసనాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది 11వసారి ప్రపంచం అంతటా ఒకే సమయానికి యోగా సాధన చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు.

యునైటెడ్ నేషన్స్‌లో భారత్ ప్రతిపాదించిన యోగా దినోత్సవాన్ని 175 దేశాలు మద్దతు ఇవ్వడం ప్రపంచ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని మోదీ తెలిపారు. యోగా ఇప్పుడు కోట్లాది మంది జీవనశైలిలో భాగంగా మారిందని పేర్కొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వహణలో సహకరించిన అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఈ యోగా ఉత్సవంలో మొత్తం 3,02,087 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.


English News

PM Modi, CM Chandrababu Naidu Participate in International Yoga Day 2025 at Visakhapatnam

Visakhapatnam:
Prime Minister Narendra Modi participated in the 11th International Yoga Day 2025 celebrations held in Visakhapatnam. He performed yoga asanas and extended greetings to people across the country and the globe on the occasion.

Modi stated it is a proud moment that the world comes together to perform yoga simultaneously for the 11th consecutive year. He recalled how India proposed the idea of International Yoga Day at the United Nations and how it received support from 175 countries, symbolizing global unity. He emphasized that yoga has now become an integral part of the lives of millions worldwide.

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu thanked everyone who participated in and contributed to the smooth organization of the event. He revealed that a record 3,02,087 people took part in the yoga session held in Visakhapatnam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *