24 గంటల్లో 59 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన “రాజా సాబ్” టీజర్ – యూట్యూబ్ ట్రెండింగ్ నెం.1

Prabhas’ Raja Saab teaser crosses 59M views in 24 hrs – YouTube #1 trending: For Telugu and English News scroll down

24 గంటల్లో 59 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన “రాజా సాబ్” టీజర్ – యూట్యూబ్ ట్రెండింగ్ నెం.1

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాజా సాబ్” టీజర్ 24 గంటల్లోనే 59 మిలియన్ వ్యూస్‌ను దాటి యూట్యూబ్ ట్రెండింగ్ నెం.1లోకి ఎక్కింది. ఇది ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను స్పష్టంగా తెలియజేస్తోంది.

వింటేజ్ లుక్‌లో ప్రభాస్ స్టయిల్, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్స్‌ టీజర్‌ను మళ్లీ మళ్లీ చూడేలా చేస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ టీజర్‌ను ప్రభాస్ అభిమానులు ఊహించినంత పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు.

ఈ టీజర్ చూస్తుంటే డిసెంబర్ 5న విడుదల కాబోయే “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కథానాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు.

Prabhas-starrer “Raja Saab” teaser has taken the internet by storm with 59+ million views in 24 hours, trending at #1 on YouTube. The massive response proves the immense craze and anticipation for the film.

Directed by Maruthi, the teaser showcases Prabhas in a vintage look with grand visuals and gripping presentation. Produced by People Media Factory, Raja Saab also stars Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar. The film is set to release in theatres worldwide on December 5, 2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *