కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ సీఎం కెసిఆర్ – వ్యక్తిగత విచారణ కోరుతూ విజ్ఞప్తి

KCR Appears Before Kaleshwaram Commission, Seeks Private Hearing on Health Grounds for English News kindly scroll down

కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ సీఎం కెసిఆర్ – వ్యక్తిగత విచారణ కోరుతూ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11:
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) మంగళవారం కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై ఏర్పడిన విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణ సమయంలో తన ఆరోగ్యం సరిగాలేదని ఆయన పేర్కొన్నారు. అదే కారణంగా బహిరంగ విచారణ కాకుండా వ్యక్తిగతంగా విచారించాలంటూ కమిషన్‌ను అభ్యర్థించారు.

కెసిఆర్ అభ్యర్థనకు కమిషన్ చైర్మన్‌ జస్టిస్ పిసి ఘోష్ అంగీకారం తెలిపారు. దీంతో కమిషన్ హాల్‌లో ముగ్గురు వ్యక్తులు మాత్రమే విచారణకు హాజరయ్యారు. వీరిలో జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, మరియు కెసిఆర్ ఉన్నారు. ప్రస్తుతం ముఖాముఖి విచారణ కొనసాగుతోంది.

ఇక, విచారణ జరుగుతుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు బీఆర్కే భవన్ వద్ద నిరసనకు దిగారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. కార్యకర్తలు – పోలీసులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అపరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

KCR Appears Before Kaleshwaram Inquiry Commission, Requests Private Hearing Citing Health

Hyderabad, June 11:
Former Chief Minister of Telangana, K. Chandrashekar Rao (KCR) appeared before the Kaleshwaram Lift Irrigation Project Inquiry Commission on Tuesday.

During the proceedings, KCR informed the Commission that he was unwell and requested that the session be held privately instead of publicly. The request was accepted by Commission Chairman Justice P.C. Ghose.

As a result, the session was conducted in a restricted setting, attended only by Justice P.C. Ghose, Commission Secretary Muralidhar, and KCR himself. A one-on-one closed-door inquiry is currently underway.

Meanwhile, tension escalated near the BRKR Bhavan as BRS party workers staged a protest in solidarity with their leader. Police detained several activists, leading to a scuffle between protesters and law enforcement. Security was beefed up to avoid further unrest.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *