కొడుకు, బిడ్డ జైలుకు పోవడం ఖాయం.. బండి సంజయ్..


కరీంనగర్‌ : కరీంనగర్‌ జైలు నుండి విడుదలైన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకుపై అతి త్వరలో వరంగల్‌ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తాం. పేపర్‌ కుట్ర దారులు వాళ్లే. తెలుగు పేపర్‌ ఎవరు లీక్‌ చేశారు. హిందీ పేపర్‌ ను లీక్‌ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను ఎందుకు చేధించడం లేదు ? విూకు దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి. ఎవరో షేర్‌ చేస్తే నాకేం సంబంధం ? వరంగల్‌ కమిషనర్‌ కు తెలివి ఉందా? మీ చేతగానతనాన్ని మాపై నెడతారా ? కవిూషనర్‌ … సంగతి తేలుస్తాం. నల్లగొండ సహా ఇతర జిల్లాల్లో ఏమేం చేశారో అన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు. మా అత్తమ్మ నన్ను కొడుకు లెక్క చూసుకుంది. ఆమె చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నావిూద ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పరా… నోటీసులివ్వరు. పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి దాపురించింది. సెల్‌ ఫోన్‌ తో విూకు ఏం అవసరం? లీకుతో నాకు సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా. సీపీ… నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేసే దమ్ముందా? పోలీసులే విూ తీరుతో తలదించుకుంటున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ నాశనమైతుంటే కేసీఆర్‌ ఎందుకు స్సందించరు ? విూరు ఇంకెన్నాళ్లు విలాస వంతమైన జీవితం గడుపుతారు? నా ఇంటిపై దాడిపై ప్రివిలేజ్‌ నోటీసులిస్తా. బాధ్యులందరినీ కోర్టుకు ఈడుస్తా. నన్ను బొమ్మల రామారంలో రిలీజ్‌ చేస్తే జైలుకు ఎందుకు పంపారు? గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పారు? లీకైన పేపర్‌ ను జర్నలిస్లు షేర్‌ చేస్తే తప్పేంటి ? ఎగ్జామ్‌ సెంటర్లోకి వెళ్లి పేపర్‌ లీక్‌ ఎట్లా చేశారు ? నేను 2 వేల మందితో సెల్ఫీలు దిగుతా…. అందరితో లింకులున్నట్లేనా ? పోలీసులకు బలగం సినిమా చూపిస్తేనైనా బంధాల విలువ తెలుస్తుందేమో. నాపై పీడీ యాక్ట్‌ కేసు పెట్టాలంటున్న హరీష్‌ పై హత్యానేరం కేసు పెట్టాలి. 1400 మంది బలిదానాలకు కారకుడు హరీషే. కేటీఆర్‌ ను సీఎం చేస్తే జంప్‌ జిలానీ హరీషే. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల మరణానికి కారకుడైన కేటీఆర్‌ పై పీడీ యాక్ట్‌ పెట్టాలి. దేశంలోని ప్రతిపక్షాలన్నింటికీ డబ్బులిస్తానని చెప్పిన కేసీఆర్‌ సంగతి తేల్చాలి. ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకుపై మాట్లాడితే పిచ్చోడంటారా? ఆత్మహత్యలు, ఉద్యోగుల జీతాలుసహా ప్రజా సమస్యలపై నిలదీస్తే పిచ్చోళ్లంటారా? తాగుబోతు చేతిలో తెలంగాణ. విూ కుటుంబం వేల కోట్లు సంపాదించుకుంటారు. తెలంగాణ ప్రజలు బర్బాద్‌ కావాలా? దమ్ముంటే అబివ్రుద్దిపై చర్చకు రావాలి. ఇచ్చిన హావిూల అమలుపై చర్చించేందుకు సిద్దమా ? తెలంగాణపై కేసీఆర్‌ కు తెగదెంపులయ్యాయి. నీ కొడుకు, బిడ్డను జైలుకు పంపడం ఖాయం. జై తెలంగాణ అంటూ జెండా మోసిన వాళ్లంతా ఏమయ్యారు? కేసీఆర్‌ కొడుకుకు అహంకారం తలకెక్కింది. దోచుకోవడానికే కేసీఆర్‌ కుటుంబం పాలన చేస్తోంది. కేసీఆర్‌ కుటుంబం అవినీతి, అరాచకాలపై ప్రజలు విసిగెత్తిపోయారు. కేసీఆర్‌ పాలనను అంతమొందించేందుకు మరో ఉద్యమానికి సిద్ధమైనమని అన్నారు.
బీఆర్‌ఎస్‌ కార్యకర్తాలారా…. తెలంగాణ కోసం కలిసి రండి. తెలంగాణ అభివ్రుద్ధికి మోదీ సిద్ధమైనా సహకరించని కేసీఆర్‌. రేపు పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే ప్రదాని మోదీ సభకు ప్రతి ఒక్కరూ తరలిరండి. బీజేపీ దమ్మేందో చూపిద్దాం. అండగా ఉన్న జాతీయ నాయకత్వానికి, లీగల్‌ టీం, కార్యకర్తలకు ధన్యవాదాలు. మేం సిద్దాంతాల కోసం పనిచేసే వాళ్లం. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. సింగరేణిలో సమ్మె చేస్తామన్న కేసీఆర్‌ సర్కార్‌ కు దమ్ముందా? సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే. 49 శాతం వాటా ఉన్న కేంద్రం ప్రైవేటీకరణ ఎలా చేయగలదు? సింగరేణిని ప్రైవేటీకరణను బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తాం. సింగరేణి కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *