ఆయిల్‌ఫెడ్‌లో భారీ స్కాం? – ప్రైవేటీకరణ కుట్రలపై తీవ్ర ఆరోపణలు

Fake seeds, privatization plot, suspended officer reinstated!
Farmers demand justice.

OilfedScam #FarmersRights #TelanganaNews

ఆయిల్‌ఫెడ్‌లో భారీ స్కాం? – ప్రైవేటీకరణ కుట్రలపై తీవ్ర ఆరోపణలు

ఆయిల్‌ఫెడ్‌లో భారీ స్కాం? – ప్రైవేటీకరణ కుట్రలపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్:
తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మోగుతున్నాయి. అధికారులు కొందరు ఐలఫెడ్‌ వ్యవస్థను తుంచెత్తేందుకు కుట్రలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ (అశ్వారావుపేట జోన్) నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

వారి ప్రకారం, జన్యుపరమైన (జీఎంఓ) మొక్కలను రైతులకు సరఫరా చేయడం వల్ల మట్టి, పంట నాణ్యతకు ముప్పు ఏర్పడుతోంది. అంతేకాదు, గతంలో సస్పెండ్ అయిన ఒక అధికారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

🔎 2018 నుంచే నకిలీ విత్తనాల స్కాం

సొసైటీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆయిల్‌ఫెడ్‌లో 2018 నుంచే నకిలీ విత్తనాల సరఫరా జరగడంతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వలన పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

🛑 కేంద్రం జోక్యం చెయ్యాలి

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించి, బాధిత రైతులకు నష్ట పరిహారం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయిల్‌ఫెడ్‌ వంటి వ్యవసాయ-ఆధారిత సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ పద్ధతుల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *