English News Headline
Telangana to Distribute Indiramma Sarees to 1 Crore Women; CM Revanth Reddy to Launch Programme on November 26

Full Telugu News Article
తెలంగాణలో రేషన్ కార్డులు కలిగిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మహిళలకు పండుగ కానుకగా చీరలను అందించడంతో పాటు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు.
చిలుకపచ్చ రంగులో ప్రత్యేక డిజైన్లు
మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో చీరలను రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలోనూ ధరించేందుకు వీలుగా తయారు చేయించారు.
ప్రభుత్వం రెండు రకాల చీరలను సిద్ధం చేసింది. ఇందులో 6.30 మీటర్ల పొడవుతో 35 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను ప్రత్యేక డిజైన్లతో తయారు చేయించినట్లు అందించిన వివరాల్లో పేర్కొన్నారు.
రేషన్ కార్డు ఉన్న మహిళలకు అర్హత
రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. అర్హులైన మహిళలు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాల నమోదు
చీరల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను అందించనున్నారు. లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేయనున్నారు. దీనివల్ల ఎవరెవరికి చీరలు పంపిణీ చేశారనే సమాచారం అందుబాటులో ఉండనుంది.
Full English News Article
Telangana to Distribute Indiramma Sarees to One Crore Women; CM Revanth Reddy to Launch Programme on November 26
The Telangana government is preparing to distribute Indiramma sarees to one crore women across the state as part of its Indira Mahila Shakti programme. Chief Minister A. Revanth Reddy is scheduled to formally launch the statewide distribution programme on November 26 at Achampet in Nagarkurnool district.
This is the second time the state government is distributing sarees to women under the initiative. The distribution plan covers 65 lakh women in rural areas and 35 lakh women in urban areas.
The sarees have been specially designed in an attractive parrot-green colour, keeping women’s preferences in mind. The government has also emphasised quality and durability while incorporating both modern and traditional designs.
Two Varieties of Sarees Prepared
The government has arranged two varieties of sarees for distribution. According to the latest reported figures, 95 lakh polyester sarees measuring 6.30 metres and five lakh poly-cotton sarees measuring nine metres have been prepared.
Weavers from different districts of Telangana have been involved in producing the sarees. Through this initiative, the government aims to provide welfare support to women while creating employment opportunities for the state’s handloom sector.
Who Is Eligible for Indiramma Sarees?
Women aged 18 years and above belonging to families holding ration cards are eligible to receive Indiramma sarees.
Eligible beneficiaries can collect the sarees by furnishing their Food Security Card and Aadhaar details.
Distribution Through Special Mobile Application
The government has made arrangements to ensure transparency in the statewide distribution process.
District Collectors and district in-charge Ministers will supervise the programme. SERP staff will distribute the sarees in villages and urban wards in the presence of public representatives.
Beneficiary details will also be registered through a dedicated mobile application to maintain records of distribution and prevent irregularities.
The initiative is expected to benefit one crore women across Telangana while also supporting local weavers and the handloom industry.