ఎస్టీపీల పూర్తి సామర్థ్యంతో శుద్ధి జలాల సరఫరా పెంచాలి

English News Headline

Hyderabad: HMWSSB MD Ashok Reddy Directs Officials to Maximise STP Capacity and Expand Treated Water Supply

పూర్తి తెలుగు వార్తా కథనం

హైదరాబాద్ మహానగరంలో శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని విస్తరించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరాను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్టీపీల పూర్తి శుద్ధి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా శుద్ధి జలాలను అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

సోమవారం నాగోల్, పటేల్ చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించిన అశోక్ రెడ్డి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ, శుద్ధి జలాల సరఫరా, నిర్మాణ రంగంలో వాటి వినియోగంపై అధికారులతో సమీక్షించారు.

నాగోల్ ఎస్టీపీని పరిశీలించిన ఎండీ

మొదట నాగోల్ ఎస్టీపీని సందర్శించిన ఆయన, అక్కడి గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎయిర్‌టెక్ యంత్రం నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగంపై ఆపరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది తాగునీరు, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా నీటి క్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్టీపీలను తక్కువ సామర్థ్యంతో నిర్వహించకుండా అందుబాటులో ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

పటేల్ చెరువు వద్ద గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ప్రారంభం

అనంతరం పటేల్ చెరువు ఎస్టీపీని సందర్శించి శుద్ధి ప్రక్రియ, గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహణను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్న సంస్థలు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

నిర్మాణ ప్రాంగణంలో శుద్ధి జలాల వినియోగంపై సమీక్ష

పటేల్ చెరువు ఎస్టీపీ నుంచి శుద్ధి చేసిన నీటితో నింపిన గ్రీన్ వాటర్ ట్యాంకర్‌తో కలిసి ఎండీ, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిర్వాణ హోమ్‌స్పేసెస్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు. నిర్మాణ పనుల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించే అంశంపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ భవనాల నిర్మాణాలు దీర్ఘకాలంపాటు కొనసాగుతున్నప్పుడు ట్యాంకర్లపై ఆధారపడకుండా ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నేరుగా శుద్ధి జలాలను సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

300 నుంచి 400 మీటర్ల ప్రత్యేక పైప్‌లైన్లపై పరిశీలన

నగరంలో కనీసం రెండేళ్లపాటు నీటి అవసరాలు ఉండే భారీ నిర్మాణ ప్రాజెక్టులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సుమారు 300 నుంచి 400 మీటర్ల మేర ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేసే సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.

పైప్‌లైన్ ఏర్పాటుకు అయ్యే వ్యయం, సరఫరా సామర్థ్యం, నిర్వహణ అవసరాలు, భవిష్యత్తులో ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు అదే పైప్‌లైన్‌ను వినియోగించుకునే అవకాశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు.

శుద్ధి జలాల నాణ్యతకు ప్రాధాన్యం

కాంక్రీట్ క్యూరింగ్, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, చెట్ల పెంపకం వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని పెంచాలని ఎండీ సూచించారు. ఆయా పనులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలను నిర్ధారించి, నీటి పరీక్షా నివేదికలు, ధ్రువీకరణ పత్రాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్యాంకర్ కేంద్రానికి చేరుకోగానే స్కానింగ్ ద్వారా వాహన వివరాలను నమోదు చేసి, అనంతరం నీటిని నింపే విధానం అమలు చేయాలన్నారు.

ట్యాంకర్ల రాకపోకలు, నీటి సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

Full English News Article

Hyderabad: Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB) Managing Director Ashok Reddy has directed officials to prepare a comprehensive action plan to maximise the utilisation of Sewage Treatment Plants (STPs) and expand the supply of treated wastewater through green water tankers.

During visits to the Nagole and Patel Cheruvu STPs on Monday, Ashok Reddy reviewed treated water supply, tanker filling operations and the use of treated wastewater in the construction sector.

Inspection of Nagole STP

At Nagole STP, the MD inspected the green water tanker filling station and reviewed the functioning of the Airtech equipment. He interacted with operators to understand the maintenance arrangements and utilisation of treated water.

He instructed officials to provide separate water cans for drinking, handwashing and other personal hygiene requirements of staff. He also stressed that STPs should operate at their full available treatment capacity.

Green Water Tankers Flagged Off at Patel Cheruvu

The MD subsequently visited Patel Cheruvu STP and reviewed the treatment process and green water tanker filling arrangements.

Along with local MLA Bandari Laxma Reddy, he flagged off green water tankers and encouraged construction companies in the area to utilise the treated water supply facility.

Visit to Nirvana Homespaces Construction Site

Ashok Reddy and the MLA visited the Nirvana Homespaces construction site along with a green water tanker filled at the Patel Cheruvu STP.

The MD discussed the use of treated wastewater in construction activities with the company’s representatives.

He suggested examining the feasibility of supplying treated water directly through dedicated pipelines instead of depending entirely on tankers, particularly for locations where two or more building projects are under construction over an extended period.

Dedicated Pipelines for Construction Projects

The MD directed officials to identify major construction projects in Hyderabad that would require water for at least two years.

Officials were asked to examine the technical feasibility of laying dedicated pipelines measuring approximately 300 to 400 metres, depending on local requirements.

A detailed report should cover installation costs, supply capacity, maintenance requirements and the possibility of using the same pipelines for other future construction projects.

Focus on Treated Water Quality

The MD emphasised expanding treated water usage for concrete curing, gardening, landscaping and plantation activities.

He instructed officials to establish appropriate water quality standards for different applications and make water testing reports and certification documents available to consumers.

Special Facilities at Green Water Tanker Filling Stations

To improve transparency and efficiency, the MD directed officials to introduce dedicated facilities at green water tanker filling stations.

Under the proposed system, vehicle details should be recorded through scanning when tankers arrive at filling stations before the vehicles are allowed to collect treated water.

Officials were also instructed to maintain updated records of tanker movements and water supply details for effective monitoring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *