హైదరాబాద్ కొత్త సీపీగా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ

English News Headline

Mahesh Bhagwat Takes Charge as New Hyderabad Police Commissioner; Prioritises Law and Order, Women’s Safety

హైదరాబాద్: నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన అధికారికంగా విధుల్లో చేరారు.

ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేష్ భగవత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్న ఆయన, హైదరాబాద్‌లో రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. నగర పోలీసు విభాగంలోని అనుభవజ్ఞులైన అధికారులతో కలిసి సమష్టిగా పనిచేస్తామని చెప్పారు.

మరోవైపు, నగరంలో భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో స్థల వివాదాలు, వాటికి సంబంధించిన దాడులు చోటుచేసుకుంటున్నాయని మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచుతామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నగర ప్రజలకు భరోసా ఇచ్చారు.

Full English News Article

Hyderabad: Senior IPS officer Mahesh Bhagwat has officially taken charge as the new Commissioner of Police for Hyderabad. He assumed office at the Telangana Integrated Command and Control Centre in Banjara Hills.

Bhagwat thanked the state government and Chief Minister Revanth Reddy for entrusting him with the important responsibility. Speaking to the media after taking charge, he said that maintaining law and order, ensuring women’s safety and managing traffic would be among his top priorities.

Referring to the fact that around 1.80 lakh people lose their lives in road accidents across the country every year, the new Police Commissioner said that special attention would be given to road safety in Hyderabad. He added that he would work collectively with the experienced officers in the city police department.

Bhagwat also expressed concern over disputes and attacks linked to land issues amid rising property values in the city. He warned that strict action would be taken against those involved in illegal activities.

He further said that habitual offenders would remain under continuous surveillance and that the police would invoke the Preventive Detention (PD) Act wherever legally warranted. He assured Hyderabad residents that efforts would be made to ensure that every offender is brought to justice in accordance with the law.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *