English News Headline
President Droupadi Murmu Advises 2025-Batch IPS Probationers to Address Citizens’ Grievances with Sensitivity

Full Telugu News Article
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 బ్యాచ్‌కు చెందిన 78వ రెగ్యులర్ రిక్రూట్మెంట్ (78 RR) ఐపీఎస్ ప్రొబేషనర్లకు ప్రజాసేవ, పోలీసింగ్ బాధ్యతలపై కీలక సూచనలు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఐపీఎస్ ప్రొబేషనర్లు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి.. ప్రజల దృష్టిలో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ప్రభుత్వ పాలనకు ప్రతిరూపాలని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ సమర్థంగా పనిచేసినప్పుడే పాలన బాగుందని ప్రజలు భావిస్తారని తెలిపారు.
పోలీసు అధికారి ప్రజల సమస్యలను సున్నితంగా, శ్రద్ధగా విన్నప్పుడు వారికి ఎంతో భరోసా కలుగుతుందని ద్రౌపది ముర్ము అన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఉన్నతాధికారులను నేరుగా కలిసే అవకాశం సాధారణంగా తక్కువగా ఉంటుందని పేర్కొంటూ, అలాంటి వారి భయాలను తొలగించి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఐపీఎస్ అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Full English News Article
President Droupadi Murmu met probationers of the Indian Police Service (IPS), 78th Regular Recruit (78 RR), 2025 batch, at Rashtrapati Bhavan.
Addressing the probationers, the President said that police officers and constables are symbols of governance in the eyes of citizens. People perceive governance to be good when the police system functions effectively.
She observed that citizens feel greatly supported when police officers listen to their grievances with sensitivity and attentiveness.
The President urged the IPS officers to prioritise addressing the fears and grievances of socially and economically weaker sections, who generally have limited access to senior officials.
She emphasised the importance of responsive, sensitive and citizen-oriented policing.