English News Headline
Malkajgiri Police Warn Against Illegal Firecracker Storage in Houses, Shops and

Full Telugu News Article
దీపావళి పండుగ నేపథ్యంలో ఇళ్లు, దుకాణాలు, గోదాములు, అనుమతులు లేని ప్రదేశాల్లో అక్రమంగా బాణసంచా నిల్వ చేయవద్దని మల్కాజిగిరి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అనధికారికంగా టపాసులు నిల్వ చేయడం ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని స్పష్టం చేశారు.
బాణసంచాను చట్టబద్ధమైన అనుమతులు కలిగిన విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. అదేవిధంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న ప్రదేశాల్లో మాత్రమే బాణసంచా నిల్వ చేయాలని కోరారు.
ఎక్కడైనా అక్రమంగా బాణసంచా నిల్వ చేసినట్లు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా దీపావళి జరుపుకుంటూ తమ పరిసర ప్రాంతాల భద్రతకు సహకరించాలని మల్కాజిగిరి పోలీసులు పిలుపునిచ్చారు.
Full English News Article
Malkajgiri Police have cautioned citizens against illegally storing firecrackers in houses, shops, godowns and other unauthorised premises ahead of Diwali celebrations, warning that such practices pose a serious threat to public safety.
In an advisory, the police urged people to purchase firecrackers only through legally authorised channels and store them exclusively in permitted premises in accordance with applicable regulations.
Citizens have also been asked to report illegal firecracker storage or any suspicious activities to the police immediately.
For emergencies, people can dial 112 for assistance.
Malkajgiri Police appealed to residents to celebrate Diwali responsibly and take collective responsibility for keeping their neighbourhoods safe.