English News Headline
TGSRTC Dussehra Special Buses: Direct Services From Hyderabad Colonies, Hostels

Full Telugu News Article
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు బస్స్టాండ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అవసరాన్ని బట్టి వారు నివసించే ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది.
ముఖ్యంగా కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల కోసం వారు నివసించే ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒకే ప్రాంతం నుంచి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంటే, వారి ప్రాంతం నుంచే నేరుగా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట, కోదాడ, భద్రాచలం, ఖమ్మం, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల కోసం సంబంధిత డివిజనల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
దసరా రద్దీ సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు బస్స్టాండ్లలో ఇబ్బందులు పడకుండా ముందస్తు బుకింగ్ సదుపాయం ఉపయోగపడనుంది. ప్రయాణికుల అవసరాన్ని బట్టి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా పండుగ రద్దీని నిర్వహించేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.
ప్రత్యేక బస్సుల బుకింగ్, సర్వీసుల వివరాల కోసం ప్రయాణికులు జూబ్లీ బస్‌స్టేషన్ జోనల్ కమ్యూనికేషన్ సెల్ 9959226160 నంబరును సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
Full English News Article
Hyderabad: The Telangana State Road Transport Corporation (TGSRTC) is arranging special bus services for passengers and students travelling from Greater Hyderabad to their hometowns during the Dussehra festival.
The corporation will facilitate special buses from residential areas, allowing passengers to avoid travelling to crowded bus stations. The arrangement is particularly aimed at students staying in colleges and hostels during the festival period.
Students can make advance arrangements for special buses from the areas where they reside. TGSRTC has also made provisions for direct services from colonies, townships and gated communities where at least 30 passengers are ready to travel together.
Passengers travelling from Hyderabad to destinations including Karimnagar, Warangal, Mahabubnagar, Nizamabad, Jagtial, Kothagudem, Mancherial, Adilabad, Nirmal, Kamareddy, Peddapalli, Suryapet, Kodad, Bhadrachalam, Khammam and Armoor can approach the concerned Divisional Deputy Regional Managers for special bus arrangements.
The advance-booking facility is expected to help students, employees and families avoid congestion at major bus stations during the Dussehra rush.