English: Sirisha Krishna Reddy’s Birthday Celebrations Held in Shamirepet

శామీర్‌పేటలో అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఉత్సాహంగా జరిగాయి. పలువురు నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య ఆమె కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
కార్యక్రమానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి తదితరులు హాజరయ్యారు.
వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించి శిరీష కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
తన జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, సోషల్ మీడియా వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులకు చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
The birthday celebrations of Alayabad Municipal Chairperson Kantham Sirisha Krishna Reddy were held with enthusiasm in Shamirepet on Thursday, in the presence of well-wishers, Congress party leaders and supporters. Several leaders greeted her with bouquets and felicitated her with shawls.
Sirisha Krishna Reddy, Chairperson of Alayabad Municipality in Shamirepet mandal, celebrated her birthday by cutting a cake in the presence of supporters and well-wishers.
TPCC senior spokesperson Singireddy Harivardhan Reddy, state leader Nakka Prabhakar Goud, Telangana Congress general secretary Pisari Mahipal Reddy, Library Chairman Bongunuri Srinivas Reddy, Medchal Market Committee Chairman Bommalapalli Narsimlu Yadav and Municipal Vice-Chairperson Malathi Madhava Reddy were among those who attended the celebrations.
Congress leaders and workers from various villages participated in the programme in large numbers. They presented bouquets and felicitated Sirisha Krishna Reddy with shawls while conveying their birthday greetings.
Sirisha Krishna Reddy thanked elected representatives, party leaders, supporters and the public who conveyed their wishes to her directly, indirectly and through social media platforms.
Municipal Commissioner Venkat Reddy, ward councillors, senior Congress leaders, former public representatives, supporters and others also participated in the celebrations.