శామీర్‌పేట విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ …

Uniforms & Shoes Distributed

విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలి: భీమిడి జైపాల్‌రెడ్డి

శామీర్‌పేట, ఆగస్టు 31: శామీర్‌పేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫామ్స్, షూస్‌ను జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్‌రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ చదువులో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం జైపాల్‌రెడ్డి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఇర్రి జ్యోతి, శామీర్‌పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్క సందీప్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ గౌడ్, విలాసాగరం అశోక్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ డప్పు సాయిబాబా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేకల అంజనేయులు, సోగడి బాల్‌రాజు, కాంగ్రెస్ నాయకులు ఎస్. బిక్షపతి, కె. బాల్‌రామ్, ఎస్. శ్రీనివాస్, బి. వెంకటేశ్, ఆర్. శ్రీనివాస్, వి. బుచ్చిబాబు, ఎ. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Students Urged to Attend School Regularly and Achieve Good Results

Shamirpet, August 31: District RTA member Bheemidi Jaipal Reddy distributed government-provided uniforms and shoes to students at the Mandal Parishad Primary School in Shamirpet.

Speaking on the occasion, Jaipal Reddy said the government was providing necessary facilities for students and urged them to make proper use of the available support. He encouraged students to attend school regularly, focus on their studies and achieve good academic results.

He also advised the students to bring a good name to their parents, school and village.

Later, Jaipal Reddy inspected the mid-day meal served at the school and had lunch with the students. He instructed the school authorities to provide quality, nutritious and tasty food every day as per the menu prescribed by the government.

He stressed that there should be no negligence in providing mid-day meals, keeping the health and future of students in mind.

School Headmaster Shankar Naik, Amma Adarsha School Committee Chairperson Irri Jyothi, Shamirpet Division Congress President Nakka Sandeep Goud, former Mandal Congress Presidents Y.S. Goud and Vilasagaram Ashok, former Sarpanch Bathula Kishore Yadav, former MPTC member Dappu Saibaba, Indiramma Committee members Mekala Anjaneyulu and Sogadi Balraj, Congress leaders and school teachers and students attended the programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *