English: Women Leaders Tie Rakhi to CM Revanth Reddy in Hyderabad
రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు

English News Headline
Women Leaders Tie Rakhi to Telangana CM Revanth Reddy in Hyderabad
Full Telugu News Article
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని పలువురు మహిళా నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా నేతలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా మాట్లాడారు.
అలాగే మలక్‌పేట్‌లోని ప్రభుత్వ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్‌కు చెందిన విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాఖీలు కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
Full English News Article
Raksha Bandhan celebrations were held at Telangana Chief Minister Revanth Reddy’s residence in Jubilee Hills, Hyderabad, with women leaders and representatives tying Rakhi to the Chief Minister and conveying their festival greetings.
Ministers Seethakka and Konda Surekha, Telangana Women’s Commission Chairperson Gadwal Vijayalakshmi, commission members, chairpersons of various corporations, representatives of Brahma Kumaris and Women Congress leaders participated in the celebrations.
The women representatives tied Rakhi to Revanth Reddy and extended their greetings on the occasion of Raksha Bandhan. The Chief Minister interacted with the participants during the celebrations.
Students of the Government High School for Blind Girls at Malakpet also met the Chief Minister and tied Rakhi to him. They conveyed their Raksha Bandhan greetings to Revanth Reddy on the occasion.