Telangana Assembly Session Update

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
బ్రిటన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు పూర్తికావడం ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసం-పునరావాస ప్యాకేజీ (R&R), అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం పాల్గొన్నారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
English
The Telangana Assembly’s monsoon session is likely to begin on September 7, Chief Minister A. Revanth Reddy informed public representatives. He urged them to focus on constituency development and expedite pending land acquisition for irrigation projects.
After returning from his UK visit, Chief Minister A. Revanth Reddy held a meeting with available ministers, MPs, MLCs and MLAs at the Dr BR Ambedkar Telangana State Secretariat. He asked public representatives to step up their focus on development works in their respective constituencies.
The Chief Minister directed officials and legislators to speed up pending land acquisition for irrigation projects in Assembly constituencies. He said delays in land acquisition could hold up completion of projects and stated that the government was ready to immediately release funds for land acquisition, rehabilitation and resettlement (R&R), and forest clearances.
Deputy Chief Minister Bhatti Vikramarka, ministers N. Uttam Kumar Reddy, Tummala Nageshwar Rao, Ponguleti Srinivas Reddy and Dhanasari Anasuya Seethakka, along with government whips and several MPs, MLCs and MLAs, attended the meeting.