English News Headline
Harish Rao Says Adilabad IT Tower Will Boost Local Jobs

Full Telugu News Article
తెలంగాణలోని నలుమూలలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న కేసీఆర్ సంకల్పానికి ఆదిలాబాద్ ఐటీ టవర్ మరో ముందడుగని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ విస్తరించేందుకు ఈ టవర్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఆదిలాబాద్ ఐటీ టవర్ ద్వారా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు లభించాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రాంతీయంగా ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ టవర్ల నిర్మాణాలు చేపట్టామని హరీశ్ రావు పేర్కొన్నారు. అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా పెద్ద కంపెనీలను ఆకర్షించగలిగామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయని హరీశ్ రావు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఆ ఐటీ టవర్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందనే వార్తలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. వెంటనే ఐటీ టవర్లలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Full English News Article
BRS leader T. Harish Rao said the upcoming Adilabad IT Tower marks another step towards the vision of expanding the IT sector across all parts of Telangana. He said the facility would help extend the IT industry to Adilabad, located around 300 kilometres from Hyderabad.
Harish Rao expressed hope that the upcoming Adilabad IT Tower would create employment opportunities for young people from Adilabad and surrounding areas. He said expanding the IT sector beyond Hyderabad could help create more local employment opportunities.
He said the BRS government had undertaken the construction of IT towers in tier-II cities with the objective of taking IT companies to different parts of Telangana. According to Harish Rao, the government had provided infrastructure and facilities to attract major companies to these locations.
He stated that IT towers were inaugurated during the BRS government in Warangal, Siddipet, Suryapet, Nalgonda, Nizamabad, Mahabubnagar, Khammam and Karimnagar.
However, Harish Rao alleged that reports were emerging about the Congress government’s failure to properly maintain these IT towers. He urged the government to immediately ensure adequate facilities at the IT towers and take steps to attract IT companies so that local youth can secure employment opportunities.