హైదరాబాద్‌లో విద్య, పరిశోధన భాగస్వామ్యం

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో లండన్‌లో చర్చలు జరిపింది. విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాల్లో సహకారానికి ఇరుపక్షాలు ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించేందుకు అంగీకరించాయి.
The Telangana government held talks in London with an academic team from the University of Cambridge, exploring collaboration in educational programmes, joint research, entrepreneurship and incubation initiatives in Hyderabad.
లండన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ అధికారిక ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో సమావేశమైంది. హైదరాబాద్‌లో ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను తెలంగాణ బృందం ఈ సందర్భంగా వివరించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు కె. రామకృష్ణారావు, జయేష్ రంజన్ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికలో అంతర్జాతీయ విద్యా సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను వారు వివరించారు.
కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న మార్కెటింగ్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన, ఫ్రూగల్ ఏఐ కో-చైర్ వెంకటేష్ గాండికోట తెలంగాణతో భాగస్వామ్యంపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు అందించడం, సంయుక్త పరిశోధనలు చేపట్టడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంక్యుబేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రతిపాదిత సహకారంలో భాగంగా పరిశీలించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇందుకోసం ఒక సహకార ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం.
London: The official ‘Telangana Rising’ delegation, led by Chief Minister Revanth Reddy, met an academic team from the University of Cambridge to discuss potential collaboration and opportunities in Hyderabad.
Revanth Reddy, along with IT and Industries Minister Duddilla Sridhar Babu and senior officials K. Ramakrishna Rao and Jayesh Ranjan, presented opportunities for leading global institutions to establish a presence in Hyderabad and contribute to developing the city as a global knowledge hub.
Jaideep Prabhu, a Government of India-sponsored Professor of Marketing at Cambridge Judge Business School, and Venkatesh Gandikota of Cambridge Judge Business School and Co-Chair of Frugal AI expressed interest in partnering with Telangana.
Both sides agreed to work towards a framework for collaboration. The areas under consideration include offering educational programmes in Hyderabad, undertaking joint research and supporting entrepreneurship and incubation initiatives.