English: Hanamkonda Development Works: 394 Double-Bedroom Houses Allotted

హనుమకొండ: పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు సమాన అభివృద్ధి, సమాన ప్రాధాన్యతే ప్రజా ప్రభుత్వ విధానమని రాష్ట్ర మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.3.23 కోట్లతో నిర్మించనున్న తహసిల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.3.25 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు హాస్టల్లో అవసరమైన వస్తువులను అందజేశారు. SSC, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను సత్కరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో గూడూరు, కమలాపూర్, మర్రిపెల్లిగూడెం గ్రామాలకు చెందిన 394 డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలు పంపిణీ చేశారు.
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసేందుకు వందల కోట్ల రూపాయలు కేటాయించి లబ్ధిదారులకు అందిస్తున్నామని వివరించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, అభివృద్ధి మరియు పేదల సంక్షేమం నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండున్నరేళ్లలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Hanamkonda: The Telangana government is committed to ensuring equal development and equal priority for all constituencies without political discrimination, the minister said during a tour of the erstwhile Warangal district. Several development works were inaugurated and foundation stones were laid in Hanamkonda district.
The minister, along with fellow minister Ponnam Prabhakar, MLA Naini Rajender Reddy, the Hanamkonda District Collector, senior officials and local representatives, participated in the programmes.
At Elkathurthy mandal headquarters, the foundation stone was laid for a new Tahsildar office building to be constructed at a cost of Rs.3.23 crore. The newly constructed Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) building, built at a cost of Rs.3.25 crore, was also inaugurated. Essential hostel items were distributed to the students, while students who secured top marks in SSC and Intermediate examinations were felicitated.
In Kamalapur mandal of the Huzurabad constituency, house allotment documents were distributed to beneficiaries of 394 double-bedroom houses belonging to Gudur, Kamalapur and Marripelligudem villages.
The minister said the government was working to fulfil the dream of owning a house for poor families. He said eligible beneficiaries were being provided houses without discrimination based on rural or urban location, caste, religion or political affiliation. Funds running into hundreds of crores were being allocated to complete double-bedroom houses and basic infrastructure left unfinished by the previous government, he said.
The minister alleged that the previous BRS government’s decade-long rule had weakened the state’s finances and neglected development and welfare of the poor. He said the present government, under Chief Minister Revanth Reddy, had introduced several welfare and development initiatives during its two-and-a-half years in office. He also said welfare schemes would continue despite criticism from opposition parties.