English News Headline
40 New Electricity Meters Distributed to Tribal Families in Sevalal Mallanna Thanda, Shamirpet

Full Telugu News Article
శామీర్పేట (మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా):
శామీర్పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్ గ్రామంలోని సేవాలాల్ మల్లన్న గిరిజన (తాండా) కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు విద్యుత్ శాఖ అధికారులు 40 నూతన విద్యుత్ కనెక్షన్ మీటర్లను అందజేశారు. ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, సేవాలాల్ తాండా మల్లన్న కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పూల్ సింగ్ నాయక్ గతంలో కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన ఎస్టీ కమిషన్, స్థానికంగా నివాసం ఉంటున్న అర్హులైన కుటుంబాలను గుర్తించి విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాల మేరకు 40 కుటుంబాలకు కొత్త విద్యుత్ మీటర్లు మంజూరు చేసి అందజేశామని తెలిపారు.
విద్యుత్ కనెక్షన్లతో కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేగంగా అందించేందుకు విద్యుత్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానేశ్వర్, డివిజనల్ ఇంజనీర్ జాన్ పోతరాజు, శామీర్పేట సబ్ డివిజన్ ఏడీఈ శ్రీనివాస్, శామీర్పేట సెక్షన్ ఏఈ విజయకుమార్, గిరిజన కాలనీ అధ్యక్షుడు పూల్ సింగ్ నాయక్, గిరిజన కుటుంబాలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Full English News Article
Shamirpet, Medchal–Malkajgiri District:
The Electricity Department distributed 40 new electricity connection meters to eligible tribal families residing in Sevalal Mallanna Tribal (Thanda) Colony at Devarayamjal in Shamirpet Division on Friday, following directions issued by the ST Commission.
Speaking on the occasion, Medchal Electricity Department Superintendent Gyaneshwar said that the President of Sevalal Thanda Mallanna Colony Association, Pool Singh Nayak, had earlier submitted a request seeking electricity connections for tribal families living in the colony.
Following the representation, the ST Commission instructed officials to identify eligible local residents and provide electricity connections. Acting on these directions, the department sanctioned and distributed 40 new electricity meters to beneficiary families.
Officials said the new power connections would improve basic civic amenities for tribal households and reaffirmed the department’s commitment to providing essential public services in accordance with government guidelines.
The programme was attended by Superintendent Gyaneshwar, Divisional Engineer John Potharaju, Assistant Divisional Engineer Srinivas, Assistant Engineer Vijay Kumar, Colony President Pool Singh Nayak, beneficiaries and Electricity Department staff.