నీట్ టాపర్లు, సాయి ప్రవల్లికకు సీఎం అభినందనలు

English News Headline

Telangana CM Congratulates NEET Achievers and Asian U-23 Gold Medalist Sai Pravalika

తెలుగు వార్త

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకొని నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, అలాగే తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లిక ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులు, క్రీడాకారిణి సాధించిన విజయాలను అభినందించారు. కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు.

గురుకుల విద్యార్థులు విద్యా రంగంలో ప్రతిభ కనబరచడం, సాయి ప్రవల్లిక అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


English News Article

Students from Telangana Social Welfare Residential Educational Institutions who secured outstanding ranks in the NEET examination, along with Sai Pravalika, the gold medal winner at the First Asian Under-23 Athletics Championships 2026, met the Chief Minister.

The Chief Minister congratulated the students and the athlete for their remarkable achievements. He appreciated their dedication, perseverance, and commitment, stating that their success has brought pride to Telangana at both the national and international levels.

He said the accomplishments of Gurukul students in competitive education and Sai Pravalika’s international athletics success would inspire the youth of the state. The Chief Minister wished them continued success in their future academic and sporting careers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *