ఆర్‌డీఎస్ పూర్తైతే అలంపూర్ సస్యశ్యామలం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

English News Headline

RDS Completion Will Transform Alampur into a Fertile Region, Says Telangana Deputy CM Bhatti Vikramarka

తెలుగు వార్త

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం పర్యటించారు. వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని రైతుల కోసం నిర్మించిన నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించారు.

ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో శాంతినగర్‌కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు.

తదుపరి జులేకల్ గ్రామంలో జులేకల్, మేడికొండ, పచ్చర్ల, పుల్లూరు ప్రాంతాలకు చెందిన నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ల ద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగునీటి అవసరాలు మరింత మెరుగుపడతాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

భారీ బహిరంగ సభలో ప్రసంగించిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) పూర్తి అయితే అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అలంపూర్ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతున్నారని, ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.


English News Article

Telangana Deputy Chief Minister Bhatti Vikramarka visited Alampur Assembly constituency in Jogulamba Gadwal district on Tuesday to inaugurate key development projects. During a public meeting held at Julekal village in Waddepally mandal, he inaugurated four new power substations dedicated to farmers.

Bhatti Vikramarka arrived at Shantinagar by a special helicopter, where he was accorded a warm welcome by former Alampur MLA and AICC Secretary Dr. S.A. Sampath Kumar along with Congress leaders and party workers. Later, he attended a tea gathering hosted at the Congress party office.

The Deputy Chief Minister inaugurated four substations serving Julekal, Medikonda, Pacharla and Pullur villages. He said the new facilities would ensure quality power supply to farmers and improve irrigation support in the region.

Addressing the public meeting, Bhatti Vikramarka stated that completion of the Rajolibanda Diversion Scheme (RDS) would transform Alampur into a fertile agricultural region. He reiterated that the Congress government is giving top priority to farmer welfare, irrigation projects and power sector development.

He also appreciated the efforts of former MLA Dr. S.A. Sampath Kumar for continuously pursuing development initiatives in Alampur and said the government is implementing several of his proposals in a phased manner.

Congress leaders and workers also celebrated the birthday of Nagarkurnool MP Dr. Mallu Ravi during the visit.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *