English News Headline
6 Natural Home Remedies to Reduce Gas, Bloating and Bad Flatulence Naturally

Full Telugu News Article
ప్రస్తుతం చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, పిత్తులు వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి కారణాలతో ఈ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు గ్యాస్, దుర్వాసనతో కూడిన పిత్తులు మానసిక అసౌకర్యానికి కూడా కారణమవుతున్నాయి.
ఇలాంటి సమస్యలకు తరచూ మందులు వాడటానికి బదులుగా వంటింట్లోనే లభించే సహజ పదార్థాలతో ఉపశమనం పొందవచ్చని కొన్ని ఆయుర్వేద మరియు సహజ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్యాస్ సమస్య తగ్గించడంలో వాము ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. వాములో ఉండే థైమోల్ అనే పదార్థం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. అర టీ స్పూన్ వాముతో చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకుంటే ఉపశమనం లభించవచ్చు.
అల్లం కూడా జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్స్, షోగోల్స్ గ్యాస్ పేరుకుపోకుండా చేయడంలో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అల్లం టీ లేదా చిన్న అల్లం ముక్కను ఉప్పుతో నమిలి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గవచ్చని చెబుతున్నారు.
జీలకర్ర నీళ్లు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో జీలకర్ర వేసి మరిగించి తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.
మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీలకర్ర పొడి లేదా వాము పొడి కలిపిన మజ్జిగ తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఇంగువ కూడా గ్యాస్ సమస్యకు ఉపయోగపడే సహజ ఔషధంగా భావిస్తారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ బయటకు వెళ్లడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే ఆహారాన్ని మెల్లగా నమిలి తినడం, భోజనం సమయంలో అధికంగా నీళ్లు తాగకపోవడం, పుదీనా టీ తీసుకోవడం వంటి అలవాట్లు కూడా జీర్ణక్రియకు మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే గ్యాస్ సమస్య తరచూ కొనసాగితే వైద్యులను సంప్రదించడం అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Full English News Article
Gas, bloating, indigestion, and excessive flatulence have become common digestive problems among people of all age groups due to unhealthy food habits and irregular eating schedules.
Health experts say overeating junk food, eating too fast, poor digestion, and skipping meals can increase gas formation in the stomach and intestines. Frequent bloating and foul-smelling flatulence can also cause discomfort in social situations.
Instead of relying only on medicines for temporary relief, several natural ingredients available in the kitchen may help improve digestion and reduce gas-related issues, according to Ayurveda and natural health practitioners.
Ajwain (carom seeds) is considered one of the most effective remedies for gas problems. Experts say the thymol compound present in ajwain helps improve the secretion of digestive enzymes and speeds up digestion. Consuming a small quantity of ajwain with rock salt and warm water may provide relief.
Ginger is also widely used to support digestion. Compounds such as gingerols and shogaols present in ginger may help prevent gas buildup and improve gut movement. Drinking ginger tea or chewing a small piece of ginger with a pinch of salt is believed to reduce bloating.
Cumin water is another traditional remedy recommended for better digestion. Boiling cumin seeds in water and drinking it regularly may help cleanse the digestive system and reduce gas formation.
Buttermilk containing beneficial bacteria like lactobacillus is considered good for gut health. Mixing cumin powder or ajwain powder in buttermilk may help improve digestion and reduce bloating naturally.
Experts also suggest asafoetida (hing) as a useful home remedy for releasing trapped gas. Adding a small quantity of hing to warm water or buttermilk after meals may support smoother digestion.
Doctors advise people to chew food slowly, avoid drinking excess water during meals, and reduce foods that commonly trigger gas, such as cabbage and peas. Mint tea and healthy eating habits may also help maintain digestive health.
However, medical experts warn that people with persistent digestive issues should consult qualified doctors instead of depending entirely on home remedies.