English News Headline
CM Revanth Reddy Seeks Fast-Track Central Clearances For Telangana Projects At Hyderabad Event

Full Telugu News Article
తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సత్వర అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో సీఎం ఈ విజ్ఞప్తి చేశారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో తెలంగాణ కీలక భాగస్వామ్యం అందిస్తుందని సీఎం తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఆరు మహానగరాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రధాన నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణకు సంబంధించి రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ – మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించినట్లు సీఎం వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ప్రధాని మోదీని కోరిన సీఎం, తెలంగాణ దేశ జీడీపీలో 10 శాతం వాటా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కే విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే వరంగల్‌లోని పీఎం మిత్ర పార్క్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కాజిపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ – గూడబెల్లూరు జాతీయ రహదారి పనులకు శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితమిచ్చారు.
Full English News Article
Chief Minister Revanth Reddy urged Prime Minister Narendra Modi to grant fast-track approvals for key Telangana development projects during a major public programme held at HICC in Hyderabad.
Addressing the gathering, the Chief Minister said Telangana would play a major role in achieving the Viksit Bharat 2047 vision and highlighted the state’s “Telangana Rising 2047” development roadmap.
Revanth Reddy requested the Centre to establish a dedicated single-window task force within the Prime Minister’s Office to expedite approvals for nationally important projects related to India’s six major metropolitan growth engines, including Hyderabad.
The Chief Minister said proposals related to the Regional Ring Road, Metro Rail expansion, Musi River rejuvenation, radial roads and the Hyderabad–Machilipatnam 12-lane highway had already been submitted to the Centre for consideration.
He stated that Telangana aims to contribute nearly 10 percent to India’s GDP in line with the national economic growth targets envisioned under Viksit Bharat 2047.
Prime Minister Narendra Modi attended the programme along with Governor Shiv Pratap Shukla, Union Ministers G Kishan Reddy and Bandi Sanjay Kumar, State Minister Komatireddy Venkat Reddy and MP K Vishweshwar Reddy.
During the event, the Prime Minister inaugurated the PM MITRA Park at Warangal and laid foundation stones for the Zaheerabad Industrial Corridor, Kazipet–Vijayawada multi-tracking railway project and the Mahabubnagar–Gudebellur National Highway project. Modi also dedicated the Indian Oil greenfield terminal at Malkapur in Hyderabad to the nation.