English News Headline
Why BRS Leadership Is Silent on Kavitha’s Sharp Criticism Against KCR

Full Telugu News Article
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మాజీ నేత కవిత చేసిన తాజా వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత, తన సొంత తండ్రి మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
‘ఇక నుంచి అక్కను కాదు.. తెలంగాణ అమ్మను’ అంటూ కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన కవిత, తన పార్టీకి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అనే పేరును ప్రకటించారు. ఇదే సమయంలో గతంలో తనకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన బీఆర్ఎస్‌పైనే తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రత్యేకంగా కేసీఆర్‌పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. ‘మన కేసీఆర్ కాదు.. మరమనిషి’ అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులను తీవ్రంగా కలిచివేశాయి. కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్‌ను ఎక్కువగా టార్గెట్ చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కవిత ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కవితను ఇప్పటికీ కుటుంబ సభ్యురాలిగానే చూస్తున్నారని, ఆమెపై నేరుగా స్పందించడం అనవసర రాజకీయ ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్య నేతలకు సూచనలు కూడా వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. కవితకు కౌంటర్ ఇస్తే ఆమెకు మరింత రాజకీయ ఎలివేషన్ లభించే అవకాశం ఉందనే వ్యూహాత్మక ఆలోచనతోనే ఈ మౌనం కొనసాగుతోందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే లైన్‌లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ వ్యవహారంగా భావిస్తూ మధ్యలో జోక్యం చేసుకోవడం అవసరం లేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
Full English News Article
Fresh political developments in Telangana have triggered intense discussion after former BRS leader and Jagruthi president Kavitha launched sharp criticism against her father and BRS chief K. Chandrashekar Rao (KCR).
While announcing her new political journey with the statement “Not just Akka, now Telangana Amma,” Kavitha declared her new party under the name TRS (Telangana Rashtra Sena), creating fresh political debate across the state.
During the announcement, she directly targeted BRS and KCR, despite the party having played a major role in building her political career. Her personal remarks against KCR, including calling him “not our KCR, but a different person,” created strong reactions within BRS circles.
Political observers noted that instead of targeting the ruling Congress in Telangana or the BJP at the Centre, Kavitha focused more on BRS, making the episode even more significant.
However, despite repeated criticism, KCR has not responded publicly. BRS Working President K.T. Rama Rao (KTR) and senior leader Harish Rao have also remained silent, which has become a major talking point.
According to party sources, the silence is being maintained strategically. Senior leaders reportedly still see Kavitha as a family member and prefer not to engage in direct public confrontation.
There is also a view within BRS that responding aggressively would only give Kavitha unnecessary political elevation and shift the main political narrative into a “Kavitha vs BRS” battle.
Party insiders say top leaders have advised cadres not to cross limits while discussing Kavitha. This calculated silence is being seen as a deliberate political strategy rather than weakness.