రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

English News Headline

CM Revanth Reddy Releases Rythu Bharosa Funds for 40 Lakh Farmers in Telangana

Full Telugu News Article

తెలంగాణ రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొని ఈ నిధులను విడుదల చేశారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తొలుత గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కంప్యూటర్‌పై బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు.

ఈరోజు రూ.2,200 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం రూ.5,700 కోట్లు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు సంక్షేమమే మా విధానం” అని అన్నారు.

రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

అంతకు ముందు రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Full English News Article

Chief Minister A. Revanth Reddy released Rythu Bharosa funds into the bank accounts of 40 lakh farmers in Telangana as agricultural investment support. The funds were released during the Rythu Utsavam held at Nasturpalli village in Jayashankar Bhupalpally district.

As part of the Prajapalana–Pragathi programme, the Chief Minister first participated in the Rythu Utsavam rally along with farmers in the village. Later, during the public meeting, he released the funds by pressing a button on a computer.

A total of Rs 2,200 crore was released today, while the government has so far released Rs 5,700 crore under the Rythu Bharosa scheme. He also announced that another Rs 3,300 crore would be released next month.

Addressing the gathering, Revanth Reddy said farmers are the backbone of the country and the government has taken responsibility to support and strengthen them. He said farmer welfare remains the government’s top priority.

He also stated that the government had fulfilled its promise of farm loan waiver up to Rs 2 lakh by clearing loans for 25.35 lakh farmers within one year of coming to power.

Earlier, the Chief Minister laid the foundation stone for a high-level bridge over the Manair River between Arenda and Damerakunta villages with an estimated cost of Rs 203 crore.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *